దైవభక్తి నేపథ్యంగా సినిమాలు రావడం అన్న విషయం కొత్త విషయం కాదు కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే శివుడు బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్ లు గా మారాయి. సీనియర్ ఎన్టీఆర్ ‘దక్షయజ్ఞం’ అప్పట్లో చాలా కష్టపడి చేస్తే అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 

చిరంజీవి ‘శ్రీమజునాథ’ మూవీలో చాల కష్టపడి శివుడుగా నటిస్తే ఆ సినిమా కూడ ఫ్లాప్ అయింది. అంతేకాదు చిరంజీవి నటించిన ‘అంజి’ మూవీ కథ అంతా శివుడు చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్ నాగార్జునకు కూడ కొనసాగుతోంది. నాగ్ నటించిన ‘ఢమరుకం’ భారీ అంచనాలు మధ్యన విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 

ఇప్పడు మళ్ళీ నాగార్జున శివుడుతో లింక్ అయ్యే మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.  కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది కూడా శివభక్తిని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ ఈసినిమాలో శివుడుగా కనిపించ బోతున్నాడు. 

ఇప్పటికే ఈపాత్ర కోసం ధనుష్ చాల రిసర్చ్ చేయడమే కాకుండా ఈమూవీలో శివుడు పాత్ర గురించి చాల నియమ నిష్టలతో ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు టాక్. దీనితో సీనియర్ ఎన్టీఆర్ నుండి నాగార్జున వరకు ఎవరికీ కలిసిరాని శివుడు సెంటిమెంట్ ధనుష్ కు కలిసి వస్తుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి ధనుష్ విషయంలో శివుడు ఏమిచేస్తాడో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: