‘స్టార్ మా’ యాజమాన్యం త్వరలో మొదలు పెట్టబోతున్న ‘బిగ్ బాస్ 3’ సీజన్ కు సంబంధించి హౌస్ మేట్స్ ఎంపిక విషయంలో ఊహించని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్. ‘బిగ్ బాస్ 2’ లో పాల్గొన్న సెలెబ్రెటీల లిస్టు చూసి బుల్లితెర ప్రేక్షకులు తీవ్ర అసహనానికి లోనై ఇలాంటి పెద్దగా ఇమేజ్ లేని సెలెబ్రెటీలు తప్ప స్టార్ మా యాజమాన్యానికి మరెవ్వరు దొరకలేదా అంటూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. 

దీనితో ‘బిగ్ బాస్ 3’ సీజన్ కోసం ఎంపికకు కాంటాక్ట్ చేస్తున్న సెలెబ్రెటీల నుండి స్టార్ మా యాజమాన్యానికి విచిత్రమైన ప్రశ్నలు ఎదురౌతున్నట్లు సమాచారం. సాధార‌ణంగా బిగ్ బాస్ హౌస్‌లో పారితోషికాలు రోజువారిగా లెక్క వేస్తారు. రోజుకి ల‌క్ష రూపాయ‌లు పారితోషికం ఇస్తాం అన్నారంటే ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారో అన్ని ల‌క్ష‌లు ఇస్తారు. అయితే ఈ హౌస్ మేట్స్ లో ఎవ్వరు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతారో తెలియదు కాబట్టి రోజువారి పారితోషికం తో పాటు ‘బిగ్ బాస్’ షోలో వారు ఎంట్రీ ఇచ్చినందుకు అదనంగా ప్రత్యేక పారితోషికాలు అడుగుతున్నట్లు సమాచారం.

అంతేకాదు ‘బిగ్ బాస్’ షో వల్ల తమకు సినిమాలలో అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదనీ గత రెండు సీజన్స్ విన్నర్ గా అవార్డులు అందుకున్న శివ బాలాజీ కౌషల్ కు ఎన్ని సినిమా అవకాశాలు వచ్చాయి అంటూ కొందరు వేస్తున్న ఎదురు ప్రశ్నలు స్టార్ మా యాజమాన్యం మైండ్ బ్లాంక్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ షోకు హోస్ట్ చేసే విషయంలో ఏ ఒక్క టాప్ సెలెబ్రెటీ ముందుకు రావడం లేదనీ వార్తలు వస్తున్నాయి. 

రానా వెంకటేష్ నాగార్జునలతో స్టార్ మా రాయబారాలు చేసినప్పటికీ వీరి ముగ్గురులో ప్రస్తుతం ఎవరు ‘బిగ్ బాస్ 3’ పట్ల ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. దీనితో ‘బిగ్ బాస్ 3’ సీజన్ ఎప్పుడు ప్రారంబం అవుతుందో స్పష్టమైన ‘స్టార్ మా’ యాజమాన్యానికి కూడ లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: