బెల్లంకొండ శ్రీనివాస్ , కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సీత" . ఈ ఏడాది ఏప్రిల్ 24న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఒక నెల ఆలస్యంగా మే 25 న విడుదలవుతోంది. సాధారణంగా ఒక చిత్రం విజయంపై హీరో, హీరోయిన్ కెరీర్లు ఆధారపడి ఉంటాయి, చిత్రంగా "సీత" సినిమా విషయంలో టోటల్ కాస్ట్ కెరీర్ మొత్తం ఆధారపడి ఉంది. 

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈమధ్య సరైన హిట్  అంటూ లేదు ఎంతో అసలు పెట్టుకున్న "కవచం" డిజాస్టర్ గా  మారింది. దీంతో శ్రీనివాస్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. ఇక హీరోయిన్ కాజల్ పరిస్థితి కూడా అంతే చేతిలో సినిమాలు పడాలంటే "సీత" పక్క హిట్ అవ్వాలి. ఇక చాలా కాలం తరవాత "నేనే రాజు నేనే మంత్రి" సినిమా హిట్ అయినా ఏమంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ సినిమా హిట్ అతనికి చాలా అవసరం. 

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబిన్స్ పరిస్థితి చాలా ఘోరం, అనూప్ పెద్ద సినిమా చేసి చాలా రోజుల్లయ్యింది. ఇక సోనూసూద్ హిరోయిన్ మన్నారా చోప్రా వీళ్ళందరికీ "సీత" సినిమా చాలా కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా వీళ్ళందరికీ కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి, మరి వీరందరి అంచనాలను "సీత" అందుకుంటుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: