ఊరికే ఖాళీగా ఉంటే ఎలా.. మనమేదన్నా కామెంట్ పెడితే అలా సరదాగా కొన్ని కామెంట్స్ వచ్చి పడతాయి కదా అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి రాం గోపాల్ వర్మ ప్రవర్తన చూస్తే.. సినిమాలతో సంచలనాలు సృష్టించడం అటుంచితే కామెంట్స్ తో ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉండే ఆర్జివి మళ్లీ మెగా ఫ్యామిలీ మీద ఓ కామెంట్ చేశాడు. ఈమధ్యనే అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబిని కలిశాడట ఆర్జివి.


ఆ విషయాన్ని చెబుతూ అల్లు బాబి ఎందుకు సిల్వర్ స్క్రీన్ పై లేడని తాను షాక్ అయ్యా అంటున్నాడు ఆర్జివి.. అంతేకాదు ఫ్రాంక్ గా చెప్పుకుంటే మెగా స్టైలిష్ పవర్ హీరోల కన్నా అతనే పెద్ద మగాడిలా ఉన్నాడు.. ఎందుకు..? అని పోస్ట్ పెట్టాడు. సినిమాలో లేని ఓ మెగా ఫ్యామిలీ పర్సన్ ను పట్టుకుని మెగా హీరోల మీద పంచ్ వేశాడు వర్మ. ఇది కచ్చితంగా కావాలని చేసిందన్నట్టుగానే ఉంది. 


అయితే వర్మ పెట్టిన ఈ కామెంట్ కు మెగా ఫ్యాన్స్ కూడా బాగానే రిప్లై ఇస్తున్నారు. అందులో ఒకరు ఇప్పుడే ఆర్జీవీ గురించి అలోచించాను..  వర్మ సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు లేడని షాక్ అయ్యాను. ఫ్రాంక్ గా చెప్పుకుంటే ఆర్జీవీ తీసిన తెలుగు, హిందీ సినిమాల్లో ఉండే విలన్స్ కంటే పెద్ద విలన్ వర్మ అని పిస్తున్నాడు... ఎందుకు?  అంటూ రిప్లై ట్వీట్ చేశాడు ఓ మెగా అభిమాని. ఇక మరొకరు అర్థరాత్రి 2.30 కు ట్వీట్ పెట్టావంటే నాలుగు పెగ్గులు వేసి ఉంటావ్..  నువ్వు నిద్రపోవు జనాలను నిద్రపోనివ్వవు అంటూ కామెంట్ పెట్టాడు.  


ఇలా వర్మ మెగా ఫ్యామిలీ మీద ఎటాక్ చేసిన నెక్స్ట్ మినిట్ రెడీగా అతని మీద ఎటాక్ కు సిద్ధంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. అప్పట్లో పవన్ వర్సెస్ ఆర్జివి ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది అయితే చిన్నగా అది సర్ధుమనిగింది. లేటెస్ట్ గా ఈ కామెంట్స్ తో మళ్లీ తాను ఎలర్ట్ గా ఉన్నానంటూ చెప్పకనే చెప్పాడు వర్మ. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో నానా హంగామా సృష్టించిన వర్మ కె.సి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమాకు టైటిల్ గా టైగర్ కె.సి.ఆర్ అని పెట్టారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: