టాలీవుడ్ టైమింగ్  బాగా మిస్ అవుతోంది. ఈ సంగతి సినీ పెద్దలు ఎన్నో సార్లు చెప్పారు. నాలుగు కాసులు వచ్చే సీజన్లను వూరికే వదిలేసుకుని వారం రోజులు మాత్రమే కలెక్షన్లు ఉండే సంక్రాంతి, దసరా వంటి వాటి కోసం తెగ పోటీ పడతారు. నిజానికి కోలీవుడ్, బాలీవుడ్ అన్ని సీజన్లను బాగా ఉపయోగించుకుంటాయి. చాలా కాలం క్రితం ఐతే టాలీవుడ్ కూడా  అలాగే ఉండేది.


ఇపుడు మన హీరోలు అంతా ఓ సినిమా చేయడానికి ఏడాదికి పైగా టైమ్ తీసుకుంటున్నారు. క్వాలిటీ అంటూ చెక్కడంతో సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఒక్కసారిగా వందల కోట్లు కుమ్మేయాలని ఆశతో సినిమాను అలా తీస్తూ పోతూ ప్రోడక్షన్ కాస్ట్ బాగా పెంచేస్తున్నారు. తీర అన్ సీజన్లోనో, పోటీ ఎక్కువగా ఉన్న టైంలోనో సినిమా రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు.


ఈసారి సమ్మర్ ని దారుణంగా వదిలేశారు. ఏప్రిల్ నేలలో చిన్న సినిమాలు రిలీజై కొంత కళ తెచ్చిపెట్టాయి. మే నెలలో మహేష్ మహర్షి ఒక్కటే బిగ్ మూవీ. ఇక జూన్ విషయానికి వస్తే మొత్తం మంత్ అలాగే ఖాళీగా  వదిలేశారు. దీంతో సమ్మర్ సీజన్ క్లోజ్ అవుతుంది. చిన్న సినిమాలు కూడా మే, జూలై నెలల్లో షెడ్యూల్ చేసుకున్నాయి. దాంతో జూన్ బొత్తిగా వేస్ట్ అయిపోతోంది. ఒక్క 7వ తేదీన మాత్రం ఓ చిన్న  సినిమా లాక్ చేసి పెట్టారు. మొత్తానికి అన్ని పెద్ద బొమ్మలూ ఒక్కసారి వచ్చి పడతాయి కాబోలు.



మరింత సమాచారం తెలుసుకోండి: