అనుష్కకు టాలీవుడ్ కి పరిచయమై పుష్కర కాలం దాటింది. సూపర్ సినిమా ద్వారా అక్కినేని నాగార్జున జోడీగా నటించిన అనుష్క అదే ఇయర్లో మెగాస్టార్ పక్కన స్టాలిన్ మూవీలో ఓ సాంగ్లో మెరిసి మురిసింది. ఈ జంటను చూసిన వారు తొందరలోనే ఫుల్ లెంగ్త్ మూవీలో కనిపిస్తారని అనుకున్నారు. అయితే తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో అనుష్కతో జోడీ కుదరలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అనుష్క మెగా హీరోతో చిందేయ‌బోతోంది.


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా లో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో చిరు తో స్టెప్పులు వేయనుందట. త్వరలోనే అనుష్క ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొననుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సైరా లో నయనతార మైన్ లీడ్  కథానాయికగా నటిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. 


ఇవన్నీ ఇలా ఉంచితే అనుష్క చిరంజీవితో హీరోయిన్ గా  నటిస్తే చూడాలని అటు మెగా ఫ్యాన్స్ లో  నిండుగా ఉంది. అయితే ఈ ఇద్దరి కాంబో మాత్రం కుదరడమేలేదు. కొరటాల మూవీలో జోడీ అనుష్క అంటూ ప్రచారం జరిగినా ఫైనల్ కాలేదు. ఓ వైపు చిరు రీ ఎంట్రీ ఇచ్చి జోరు మీద ఉన్నారు. అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. మరి ఈ జోడీతో  పూర్తి సినిమా వస్తుందా..


మరింత సమాచారం తెలుసుకోండి: