అమలాపాల్  అందగత్తె. తెలుగులో రామ్ చరణ్ తో నాయక్ మూవీ చేసి హిట్ కొట్టింది. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిగా మెరిసింది.  కోలీవుడ్లో మంచి సినిమాలు చేసింది. చేస్తోంది. ఈ అందాల భామ ఇపుడు నెటిజన్ల ట్రోలింగ్ తో బిగ్ ట్రబుల్లో పడింది. అమలాపాల్ చేసింది తప్పు కాదు కానీ మెదళ్ళన్నీ బూజు పట్టేసిన వారు మాత్రం అలాగే అర్ధం చేసుకుంటారు. దాంతో అమలాపాల్ ని  వల్గర్ పదాలతో ఇబ్బంది పెట్టేస్తున్నారు.


ఇంతకీ అమలాపాల్ వేసవిలో మ్యాంగోల డిమాండ్ ని స్వీట్ ని గుర్తు చేస్తూ మామిడి పండు రంగులో ఉన్న టైట్ టాప్ ధరించి.. ‘ఈరోజు నేను హ్యపీ మ్యాంగోని.. నేను ఏది కావాలంటే అది కావొచ్చు’ అంటూ తనకు నచ్చిన కలర్ ఎల్లో అనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌ పెడార్ధాలకు తావివ్వడంతో నెటిజన్లకు వేరేలా అర్ధమై అమలాపాల్ పోస్ట్‌లపై ఎప్పటిలాగే డబుల్ మీనింగ్‌ డైలాగ్‌లతో చుక్కలు చూపిస్తున్నారు. 


హాట్ మ్యాంగోస్.. క్యూట్ మ్యాంగోస్.. స్మాల్ మ్యాంగోల్.. అంటూ రెండూ రేటు ఎంత అని కొంతమంది బూతులతో రెచ్చిపోతున్నారు. ఎదభాగం బాగా కనిపించేట్టుగా టాప్ వేసుకుని ‘ఈరోజు నేను మ్యాంగోని’ అంటే ఇలానే ఉంటుంది మరీ అంటూ వర్గర్ కామెంట్స్‌ని సమర్ధించుకుంటున్నారు ట్రోలర్స్. అయినా మరీ ఇంతలా దిగజారాలా అన్నది ఇపుడు ప్రశ్న. అమలా ఏదో బోల్డ్ టైప్. సరదాగా పొస్ట్ పెడితే మరీ ఇంతలా రెచ్చిపోయి బుధ్ధి చూపించుకోవాలా. ఇంతే మరి ఈ లోకం మారదుగా. అయినా అమలా కూడా తగ్గదండోయ్. తగ్గితే మామూలు ఆడపిల్లకూ అమలాకు తేడా ఏముంది. గో ఎహెడ్ అమలా. పైత్యం గాళ్ల లేకి బుధ్ధిని ఎండగట్టేయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: