సౌత్ లోని మిగితా సినీ ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే శాండిల్ వుడ్ కాస్త వెనకబడి ఉంటుంది. మార్కెట్ పరంగా కానీ, రీచ్ పరంగా కానీ శాండిల్ వుడ్ స్థాయి కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పడిప్పుడే కన్నడ సినిమా రేంజ్ పెరుగుతోంది. "కెజిఎఫ్" లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించాయి. 

అయితే ఇప్పుడు వరుస ప్లాప్ సినిమాలు వస్తుండటంతో కన్నడ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు, కన్నడ ఇండస్ట్రీలో నాలుగు నెలలో మొత్తం 66 సినిమాలు విడుదలయితే అందులో కేవలం 10 సినిమాలు మాత్రమే విజయాల్ని సొంతం చేసుకున్నాయట, దీంతో భారీ ఖర్చు పెట్టి సినిమాలను నిర్మించిన సదరు నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 

ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు కనీసం పెట్టుబడి కూడా రాకుంటే ఇక ఎలా సినిమాలు నిర్మించాలని వారు వాపోతున్నారు. ఇకపై ఇలానే సాగితే సినిమాలు ఆపేసి  ఇతర వ్యాపార రంగాలపై దృష్టిసారించాల్సొస్తున్నట్లు  చెప్తున్నారు. ఇప్పటికే ఇక గత ఏడాదితో  పోల్చితే ఈ ఏడాది విడుదలయిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే కన్నడ చిత్రసీమలో భారీ చిత్రాల మనుగడ కష్టమే అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: