టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. ముందుగా ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోని ఆసియ‌న్ గ్రూప్‌లో ఉన్న మ‌ల్టీఫ్లెక్స్ స్క్రీన్లు, మ‌ల్టీఫ్లెక్స్‌లలో టిక్కెట్ల బుకింగ్ స్టార్ట్ చేయ‌గా తొలి రోజు మాత్ర‌మే ఈ గ్రూప్‌లో ఉన్న థియేట‌ర్ల‌లో కేవ‌లం ఫ‌స్ట్ డే కోసం ల‌క్ష‌న్న‌ర టిక్కెట్లు అమ్ముడైన‌ట్టు అంచ‌నా.


ట్విన్ సిటీస్‌లో ఆసియ‌న్ గ్రూప్‌లో ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు మాత్ర‌మే ఇవి. టిక్కెట్ రేట్లు పెంచినా కూడా ఏకంగా ల‌క్ష‌న్న‌ర టిక్కెట్లు అమ్ముడ‌య్యాయి అంటే మాట‌లు కాదు. ఇంకా పీవీఆర్‌, ఐనాక్స్ బుకింగ్‌లు స్టార్ట్ కాలేదు. ఇంకా ట్విన్ సిటీస్‌లో ఉన్న సింగిల్ థియేట‌ర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఇవి కాక ఇంకా నైజాంలో మిగిలిన ఏరియాల్లో ఉన్న మ‌ల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ల బుకింగ్‌లు కూడా స్టార్ట్ అయితే తొలి రోజు నైజాంలో మ‌హ‌ర్షి రికార్డుల దుమ్ము దుల‌ప‌డం ఖాయ‌మే.


ఇక నైజాంలో ఒక్క ఆసియ‌న్ సంస్థ మాత్ర‌మే 110 స్క్రీన్ల‌లో మ‌హ‌ర్షి సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇంకా దిల్ రాజు, అల్లు అర‌వింద్ గ్రూపు థియేట‌ర్లు ఇవ‌న్నీ క‌లుపుకుంటే స్క్రీన్ల సంఖ్య చాలా ఎక్కువే. ఇక ప్ర‌తిష్టాత్మ‌క ఏఎంబీ మాల్‌లో తొలి రోజే ఇర‌వైకి పైగా షోలు పెడితే అన్ని ఫుల్ అయిపోయాయ‌ట‌. ఈ లెక్క‌న మ‌హ‌ర్షి మానియా మామూలుగా ఉండేలా లేదు. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా తొలి రోజు వ‌సూళ్ల లెక్క‌ల నుంచి మ‌హ‌ర్షి రికార్డులు స్టార్ట్ అవుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: