మ‌హేష్‌బాబు కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కుతోంది మ‌హ‌ర్షి. కెరీర్‌లో చూస్తే మ‌హేష్ అన్ని విధాలా కీల‌క‌మైన స్టేజ్‌లో ఉన్నాడు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. సోలోగా వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు మ‌హేష్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మేనియా అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌హేష్ త‌న 25 సినిమాల గురించి చెపుతున్నాడు.


ఈ క్ర‌మంలోనే మ‌హేష్ త‌న తొలి సినిమా అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. మ‌హేష్ తొలి సినిమా రాజ‌కుమారుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కింది. ఈ సినిమా స్టోరీ నెరేష‌న్ జ‌రుగుతున్న టైంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌కు క్లాస్ పీకిన విష‌యాన్ని ఇప్పుడు మ‌హేష్ చెప్పాడు. రాజ‌కుమారుడు నెరేష‌న్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెపుతున్న టైంలో రాఘ‌వేంద్ర‌రావు టేబుల్‌పై ఓ ర‌బ్బ‌ర్ బ్యాండ్ ఉంద‌ట‌. మ‌హేష్ దానితో ఆడుకుంటున్నాడ‌ట‌.


ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ చెప్పి వెళ్లిపోయాక రాఘ‌వేంద్ర‌రావు క‌థ న‌చ్చినా.. న‌చ్చ‌పోయినా న‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించాల‌ని... లేక‌పోతే ద‌ర్శ‌కుల కాన్ఫిడెన్స్ పోతుంది... ఫ్యూచ‌ర్‌లో ఇలా చేయ‌కు అని క్లాస్ పీకార‌ట‌. ఆ సంఘ‌ట‌న త‌న‌కు ఎప్ప‌ట‌కీ గుర్తుండి పోతుంద‌ని చెప్పిన మ‌హేష్ బాల‌న‌టుడిగా న‌ట‌న‌పై అనుభ‌వం ఉన్నా తొలి సినిమాలో హీరోగా ఇబ్బంది ప‌డిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ఎలా నుంచోవాలి ? ఎలా కూర్చోవాలి ? అన్న విష‌యాల‌ను కూడా రాఘ‌వేంద్ర‌రావే నేర్పించార‌ని... ఇక త‌న‌లో ఉన్న న‌టుడిని మురారి సినిమా బ‌య‌ట‌కు తీసింద‌ని ఆ విష‌యాలు గుర్తు చేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: