మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. ఇటీవల మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు తనతో సినిమాలు తీసిన అందరు దర్శకుల గురించి ప్రస్తావించారు.  ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ గురించి ప్రస్తావించ కపోవడంతో విమర్శలు తలెత్తాయి..దాంతో వెంటనే ట్విట్టర్ వేధికగా పూరి నాకు ‘పోకిరి’సినిమాతో ఇచ్చి సూపర్ స్టార్ ని చేశారని..ఆయన ప్రస్తావన తీసుకు రాకపోవడంపై క్షమాపణ కోరారు.


ఇదే సందర్భంగా నేనొక్కడినే సినిమా తీసిన సుకుమార్ గురించి కూాడా ప్రస్తావించలేదు. అంతే కాదు ఈ మద్య కొంత మంది దర్శకులు కథ వినిపిస్తున్నారు..అయితే కాస్త సమయం పడుతుందంటే  వెంటనే వేరే హీరో కి ఆ కథ చెప్పేసి ఓకే అనిపించుకుంటున్నారు.  కానీ వంశి మాత్రం తన కోసం రెండేళ్లు ఆగాడని మెచ్చుకున్నారు. వేరే డైరెక్టర్ ఎవరన్నా అయితే తన కోసం ఆగకుండా వేరే హీరోని ఎతుక్కునేవారంటూ సుకుమార్ ని ఉద్దేశించే ఆ డైలాగ్ చెప్పాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రీసెంట్ గా మహర్షి ఇంటర్వూస్ లో మీడియా వారి నుండి అదే ప్రశ్న ఎదురవగా దానికి మహేష్ తెలివైన సమాధానం చెప్పాడు.   


వంశీ పైడిపల్లిని తాను పొగిడాను కానీ.. సుకుమార్ ని ఏం అనలేదని.. ఆ విషయంలో మీడియా గూడార్ధాలు వెతకొద్దని చెప్పాడు. సుకుమార్ తనకి నేనొక్కడినే లాంటి మంచి చిత్రం ఇచ్చాడని...ఇటీవల రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్న సుకుమార్ ఆయనతో తన సినిమా ఉంటుందని అన్నారు.  ఈ మద్య మెసేజ్, సీరియస్ జోన్ లో ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నానని..అయితే మంచి ఎంట్రటైన్ మెంట్ మూవీ తీయాలనే ఉద్దేశంతో అనీల్ రావిపూడి తో కమిట్ అయ్యానని అన్నారు. తర్వాత  సుకుమార్ తో కలిసి సినిమా చేద్దామని అనుకున్నామని.. కాబట్టి త్వరలోనే తమ కాంబోలో మూవీ ఉందని మహేష్ చెప్పాడు.  అంతేకాదు రాజమౌళిగారితోను కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వస్తుంది" అని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: