స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య గ‌తేడాది స‌మ్మ‌ర్‌లో వ‌చ్చింది. బ‌న్నీ నుంచి సినిమా వ‌చ్చి యేడాది దాటుతోంది. ఇటు ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు సినీ అభిమాని కూడా బ‌న్నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. నా పేరు సూర్య క‌థ ఎంపిక విష‌యంలో రాంగ్ స్టెప్ వేశాన‌ని భావిస్తోన్న బ‌న్నీ నెక్ట్స్ సినిమాను మంచి క‌థ‌తో చేయాల‌ని ఏకంగా యేడాదికి పైగా టైం వేస్ట్ చేశాడు. ఎట్ట‌కేల‌కు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.


ఇక ఇక్క‌డే బ‌న్నీ ఓవ‌ర్ కాన్పిడెన్స్‌తో ముందుకు వెళుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నా పేరు సూర్య త‌ర్వాత నెక్ట్స్ సినిమాకే ఏకంగా యేడాది టైం తీసుకున్న మ‌నోడు ఇప్పుడు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వ‌రుస‌పెట్టి మూడు సినిమాలు చేసేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ అయిన వెంట‌నే సుకుమార్ సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నాడు. బ‌న్నీ - సుకుమార్ సినిమాకు ఈ నెల 11న కొబ్బ‌రికాయ కొడుతున్నారు.


ఇక త్రివిక్ర‌మ్‌, సుకుమార్ సినిమాల‌తో పాటే దిల్ రాజు బ్యాన‌ర్‌లో కమిట్ అయిన సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్‌లో బ‌న్నీ  ‘ఐకాన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ మూవీ సెట్స్ పై ఉంటుండగానే స్టార్ట్ చేయబోతున్నాడు. ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా గ్యాప్ లేకుండా చేయ‌కుండా.. యేడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఇప్ప‌టికిప్పుడు హ‌డావిడిగా వ‌రుస‌గా మూడు సినిమాలు చేస్తుండ‌డంతో బ‌న్నీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళుతున్నాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.


బ‌న్నీ గ‌త కొద్ది రోజులుగా సినిమాలు బాగా స్లో చేసేశాడు. యేడాదికి ఒక సినిమా మాత్ర‌మే చేస్తూ వ‌స్తున్నాడు. ఈ సారి రూటు మార్చి వ‌రుస‌గా సినిమాల‌కు ఓకే చెపుతున్నాడు. ఈ సినిమాల రిజ‌ల్ట్ తేడా కొడితే మాత్రం మ‌నోడి మార్కెట్ రివ‌ర్స్‌లో ఉండ‌డం ఖాయం. మ‌రి స‌రైన క‌థ‌లు ఎంచుకుని సినిమాలు చేస్తాడా ?  లేదా ?  హ‌డావిడిగా చుట్టేస్తాడో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: