మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు నాలుగేళ్ల క్రితం వ‌ర‌కు మార్కెట్‌, క్రేజ్ చాలా టాప్‌లో ఉండేది. అప్ప‌టి నుంచి వ‌రుస ప‌రాజ‌యాల‌తో మ‌నోడి మార్కెట్‌, క్రేజ్ రెండూ డౌన్ అయిపోయాయి. మ‌ధ్య‌లో రాజా ది గ్రేట్ ఒక్క‌టి అనిల్ రావిపూడి - దిల్ రాజు పుణ్యాన మ‌నోడి కెరీర్‌కు కాస్త ఊపు తెచ్చింది. ఆ త‌ర్వాత నేల టిక్కెట్‌, ట‌చ్ చేసి చూడు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఇలా చెప్పుకుంటూ పోతే వ‌రుస‌గా ప‌రాజ‌యాలే ప‌ల‌క‌రించాయి. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ర‌వితేజ సినిమా అంటేనే బ‌య్య‌ర్లు కొన‌ని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమాల‌కు నాన్ రిఫండ‌బుల్ అడ్వాన్స్‌లు భారీగా వ‌చ్చేవి. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవ్వ‌డంతో అడ్వాన్స్ సిస్టంలు పోయాయి. సినిమా రిలీజ్ అయ్యాక డ‌బ్బులు వ‌స్తే ఇవ్వ‌డం లేక‌పోతే లేద‌న్న‌ట్టుగా ప‌రిస్థితి దిగ‌జారింది.


ఇక అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌ర్వాత ర‌వితేజ‌తో సినిమాలు చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇక ప్లాపుల్లో ఉన్న కొంద‌రు ద‌ర్శ‌కులు ఇదే ఛాన్స్ అన్న‌ట్టుగా ర‌వితేజ‌తో సినిమాలు చేసేయాల‌ని దూరిపోతున్నారు. రవితేజతో తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ప్లాపుల ద‌ర్శ‌కులు సంప‌త్‌నంది, గోపీచంద్ మ‌లినేనితో పాటు అజ‌య్ భూప‌తి ఈ లిస్టులో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు ర‌వితేజ‌ను త‌మ క‌థ‌తో ఒప్పిస్తారో ..!


ఇక ఇదిలా ఉంటే ర‌వితేజ కిక్ -2 సినిమా త‌ర్వాత ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు పారితోష‌కం తీసుకునే వాడు. ఆ త‌ర్వాత రూ.6 నుంచి 5, చివ‌ర‌కు 4 కోట్ల‌కు అయినా సినిమా చేసేందుకు ఓకే చెపుతున్నాడ‌ట‌. మ‌ధ్య‌లో రెమ్యున‌రేష‌న్ విష‌యంలో బెట్టు దిగ‌న‌ని... ఎంత చెత్త క‌థ‌తో అయినా సినిమాలు చేసి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు. ఇప్పుడు మార్కెట్ లేక‌పోవ‌డంతో రెమ్యున‌రేష‌న్‌ను స‌గానికి సంగం త‌గ్గించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక ర‌వితేజ‌కు రెమ్యున‌రేష‌న్‌లోనూ కోత పెడుతున్న ద‌ర్శ‌కులు సినిమాకు బడ్జెట్ విష‌యంలోనూ చాలా కొర్రీలు పెడుతున్నార‌ట‌. పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్మ‌డం అన్న సామెత ర‌వితేజ‌కు క‌రెక్టుగా వ‌ర్తిస్తుందేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: