విక్టరీ వెంకటేష్ మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ కు రంగం సిద్ధం చేసుకున్నారు. రీమేక్ రారాజైన వెంకటేష్ ఈమధ్య వరుస మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఎఫ్-2 తర్వాత ప్రస్తుతం వెంకీమామ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ తర్వాత కూడా ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా అది కూడా మల్టీస్టారర్ మూవీకి ఓకే చెప్పాడట. ఇంతకీ వెంకీ చేస్తున్న రీమేక్ మూవీ ఏంటి అంటే విక్రంవేద అని తెలుస్తుంది.


విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి చేసిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ రీమేక్ లో వెంకటేష్ తో పాటుగా నారా రోహిత్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీని వివి వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఇంటిలిజెంట్ తర్వాత వినాయక్ కు సినిమా ఛాన్స్ రాలేదు. అయితే సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయడంలో వినాయక్ కు ఆల్రెడీ మంచి అనుభవం ఉంది.


అందుకే వినాయక్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని అనుకున్నారట. త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ వస్తుందని తెలుస్తుంది. వెంకీమామ షూటింగ్ ఆల్రెడీ శరవేగంగా జరుపుకుంటుంది. ఆ సినిమా పూర్తి కాకముందే వెంకీ ఈ సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇక నారా రోహిత్ విషయానికొస్తే ఈమధ్య సినిమాలను తగ్గించిన నారా రోహిత్ విక్రంవేద రీమేక్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు.


ఎఫ్-2 సక్సెస్ తర్వాత మళ్లీ వెంకటేష్ కెరియర్ జోరు అందుకుంది. అయితే ఆయన సోలో సినిమాల కన్నా మల్టీస్టారర్ సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా కాబట్టి విక్రం వేద తెలుగులో కూడా అదే రిజల్ట్ అందుకుంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా నిర్మాత ఎవరు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: