మహర్షి మూవీ ప్రమోషన్ లో మహేష్ బాగా బిజీ గా ఉన్నాడు. మీడియాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. అయితే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించాలని ఉంది. కానీ దర్శకుడిని బట్టి.. ఆయన చెప్పే కథను బట్టి సినిమా చేస్తాను. హిస్టారికల్ సినిమాలు తీయడం అంటే అందరితీ కాదు. ఒకవేళ రాజమౌళి లాంటి దర్శకులైతే గుడ్డిగా నమ్మవచ్చు. అలాంటి డైరెక్టర్లు వస్తే హిస్టారికల్, జానపద చిత్రంలో నటిస్తాను. ఒప్పుడు కొత్తదనం కోసం ఎదురుచూస్తాను అని మహేష్ అన్నారు. 


రాజమౌళి దేశం గర్వించ దగిన డైరెక్టర్‌. ఆయన సినిమాకు అన్ని భాషల్లో అభిమానులున్నారు. ఆయనతో డిస్కషన్‌ పూర్తయింది. ఆయన కమిటమెంట్స్‌, నా కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక కె.ఎల్‌. నారాయణ నిర్మాతగా సినిమా ఉంటుంది. అలాగే త్రివిక్రమ్‌గారితో కూడా సబ్జెక్ట్‌ డిస్కషన్‌ జరిగింది. అది కూడా పూర్తి పాజిటివ్‌గా ఉంది అని మహేష్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ సినిమా తీద్దాం అని హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన రిక్వెస్ట్‌పై మహేష్ బాబు సెటైర్లు వేశాడు.


ఆయన ఖాళీగా ఉన్నాడేమో.. అందుకే ట్వీట్లు చేస్తున్నాడని చెప్పి నవ్వుల్లో మునిగిపోయాడు. గత కొద్దికాలంగా తెలుగు సినిమాలు తప్ప మరే భాష సినిమాల్లోకి వెళ్లనని మహేష్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల బిల్ డ్యూక్ .. లాస్ ఏంజెలెస్‌కు వస్తే కలవడం.. మనం ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ సినిమా గురించి చర్చిద్దాం అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: