‘మహర్షి’ విడుదలకు ఇక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈమూవీని ప్రమోట్ చేస్తూ మహేష్ వివిధ ఛానల్స్ కు ఇస్తున్న ఇంటర్వ్యూల స్పీడ్ పెంచాడు. మహేష్ వంశీ పైడిపల్లి అల్లరి నరేశ్ పూజ హెగ్డేలు కలిసి కొన్ని ఇంటర్వ్యూలు పూజ హెగ్డేతో వేరుగా మరికొన్ని ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూ ఛానల్స్ ‘మహర్షి’ హంగామాను పెంచుతున్నాయి.

ఇలాంటి సందర్భంలో మహేష్ తన ఫిలిం జర్నీ గురించి మాట్లాడుతూ తన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ మూవీ విషయంలో తాను రాఘవేంద్రరావు చేత తిట్లు తిట్టించుకున్న సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు. అప్పట్లో తనకు సినిమాల విషయమై అవగాహన లేదు అని చెపుతూ రచయితలు పరుచూరి బ్రదర్స్ రాఘవేంద్రరావుతో కలిసి తన ఇంటికి వచ్చి ‘రాజకుమారుడు’ కథ చెపుతున్నప్పుడు తాను ఆకథను శ్రద్ధగా వినకుండా తన టేబుల్ పై ఉన్న రబ్బరు బ్యాండ్ తో ఆడుకున్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు మహేష్.   

ఆతరువాత రాఘవేంద్రరావు తన ప్రవర్తనను చూసి తీవ్ర అసహనానికి లోనై దర్శకుడు అతడి రచయితలతో కలిసి వచ్చి ఇలా కథ చెపుతున్నప్పుడు కథ నచ్చకపోయినా కథ నచ్చినట్లు ప్రవర్తించాలి కాని ఇలా రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటూ కనిపిస్తే దర్శకుల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందనీ అప్పట్లో రాఘవేంద్రరావు తనకు పీకిన క్లాసును మహేష్ గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ఒక హీరో ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఇలా ఇగో ఉండకూడదు అంటూ అప్పుడు రాఘవేంద్రరావు చెప్పిన విషయాలు నిజానికి అప్పట్లో తనకు అర్ధం కాలేదు అంటూ తన పై తానే కామెంట్ చేసుకున్నాడు.

వాస్తవానికి తనకు బాలనటుడిగా కాస్త అనుభవం ఉన్నప్పటికీ హీరోగా ఎంట్రీ అనేసరికి చాలా ఇబ్బందిపడ్డానని అయితే రాఘవేంద్రరావు ఎంతో ఓపికతో తనకు నటన విషయంలో చాల విషయాలు నేర్పించిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు కెమెరా ముందు ఎలా నిలబడాలి మరి ఎలా కూర్చోవాలి లాంటి అనేక విషయాలు తనకు తెలియచేసిన మొదటి గురువు రాఘవేంద్రరావు అంటూ మహేష్ ప్రశంసలు కురిపించాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: