రామ్ గోపాల్ వర్మ అర్దరాత్రి పెట్టె ట్విట్స్ తరుచు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తాను పడుకునే ముందు మద్యం మత్తులో తాను ఏమి ట్విట్ పెడతానో తనకే తెలియదు అంటూ పలుసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో వర్మ పెట్టిన ట్విట్ అల్లు కుటుంబంలో చిచ్చు పెట్టిందని అల్లు అర్జున్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి గురించి చాలామందికి తెలియదు. అరవింద్ వ్యాపార వ్యవహారాలు అన్నీ చూసుకుంటూ అతడు ఎప్పుడు బయటకనపడడు. అయితే ఈమధ్య ఒక స్టార్ హోటల్ లో వర్మ అనుకోకుండా అల్లు బాబిని కలవడం జరిగిందట. 

అల్లు బాబి లుక్ చూసి వర్మ ఆశ్చర్యపోయి అల్లు కుటుంబంలో చాల అందంగా కనిపిస్తున్న స్టైలిష్ హీరో అల్లు బాబి మాత్రమే అంటూ ప్రశంసలు కురిపించి సినిమాలలో నటించవచ్చు కదా అంటూ సలహాలు ఇచ్చాడట. దానికి నవ్వుతూ అల్లు బాబి వర్మతో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోయాడట. అయితే వర్మ మాత్రం అల్లు బాబి లుక్ ను చూసిన షాక్ లో ఆరోజు అర్దరాత్రి ఒక ట్విట్ చేసాడు. ‘అల్లు బాబీని ఇప్పుడే కలిశాను. ఆయన వెండితెర మీదకు ఎందుకు రాలేదని షాక్ కలిగింది. మెగా హీరోల్లో ప్రతిభకు ఏ మాత్రం తక్కువ లేదనిపించింది. స్టైలిష్ హీరోల కంటే ఏ మాత్రం తక్కువ కాదు అని వర్మ ట్వీట్’ చేశాడు.

సరదాగా వర్మ చేసిన ట్విట్ పై అల్లు అర్జున్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. అల్లు ఫామిలీలో చిచ్చు పెట్టడానికి ఇలా వర్మ అల్లు బాబీని నిజమైన స్టైలిష్  స్టార్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడని అంటూ వర్మ పై మండి పడుతున్నాడు. మరి కొందరు వేరే విధంగా స్పందిస్తూ ‘మెగా కాపు క్రికెట్ టీమ్‌ లో అల్లు బాబీ డ్రింక్స్ బాయ్‌’ అంటూ జోక్స్ చేస్తూ వర్మ ట్విట్ పై తమదైన రీతిలో స్పందన ఇస్తున్నారు. వర్మ చేసిన ట్విట్ తో మీడియాకు దూరంగా ఉండే అల్లు బాబి అనవసరంగా సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: