ఇటీవల ఎన్టీఆర్ ప్రణతి దంపతులు పెళ్లి చేసుకొని ఎనిమిది సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి తో కలసి దిగిన ఫోటో ఒకటి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ను భార్య ప్రణతి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘ఎనిమిదేళ్లు.. మున్ముందు మరెన్నో సంవత్సరాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.  

Related image

ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలింది అన్న విషయం తెలియచేస్తూ చేతికి కట్టు కట్టి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ఇటీవల షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ కి కుడి చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం సందర్భంగా ఇటీవల షూటింగ్ కూడా ఆపేసినట్లు ఫిలింనగర్ టాక్.

Ntr Shares a personal photo with his wife in Twitter

అంతే కాకుండా మరో పక్క రామ్ చరణ్ కూడా కాలికి గాయం అయింది. దీంతో ఈ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా ఇద్దరు హీరోలు గాయాలపాలు అవడంతో సినిమా యూనిట్ సినిమా ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ బోతున్నట్లు కూడా టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రణతి పెట్టిన పోస్టు చూసి అభిమానులు... ఎలా ఉంది మీ చేతికి, గాయం నయమైననట్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది  నుంచి తారక్‌ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: