మెగాస్టార్ చిరంజీవిత తనయుడు రాంచరణ్ ‘చిరుత’చిత్రంతో హీరోగా  ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా..రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.  అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రికార్డులు బద్దలు కొట్టింది. 

రాంచరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు కామినేని ఉపసాన ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం వీరిద్దరూ తమ జీవితాన్న ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.  అయితే ఉపాసన సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉంటుంది. మెగా కుటుంబానికి సంబందించిన ప్రతి సంతోషకరమైన వార్తలు ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది.

ముఖ్యంగా తన భర్త రాంచరణ్ గురించి ఎక్కువగా ట్విట్ లో ప్రస్తావిస్తుంది.  మన జీవితంలో చిన్న నాటి జ్ఞాపకాలు  వారికైనా మధురానుభూతిని మిగులుస్తుం టాయి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల రోజుల్లో స్నేహితులతో కలిసి చేసే  సందడి, వారితో గడిపిన క్షణాలు కళ్లెదుటే కదలాడతాయి.  ఇటీవల రాంచరణ్ తమిళ నాడు వెళ్లినపుడు తాను చిన్నపుడు చదువుకున్న లారెన్స్ స్కూల్ కి వెళ్లి అక్కడి ఉపాధ్యాయులను, విద్యార్థులను కలిసి సందడి చేశారు.

దానికి సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.  అక్కడికి వెళ్లి స్కూల్‌ క్యాంటీన్‌, డార్మెటరీ, తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలను  తన చిన్నప్పటి జ్ఞాపాలు గుర్తుకు చేసుకొని తెగ సంబరపడిపోయాడట. అక్కడి విద్యార్థులతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: