సాయి కుమార్ తనయుడిగా ఆది ప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి సినిమాలైతే చేస్తున్నాడు కాని హీరోగా ఇంకా ఓ ఇమేజ్ తెచ్చుకోవడంలో మాత్రం వెనుకపడ్డాడు. అయినా సరే ఆది పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఆది నటిస్తున్న సినిమా బుర్రకథ. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ టీజర్ చూస్తే తప్పకుండా ఆది ఈసారి హిట్టు కొట్టేస్తాడేమో అనిపిస్తుంది.


ఇక సినిమా కాన్సెప్ట్ విషయానికొస్తే.. అభిరాం అదేనండి మన ఆది ఒకసారి ట్రెండీగా మరోసారి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాడు. మోడ్రెన్ గాయ్ గా మనోడు రచ్చ చేస్తుంటే మరోపక్క ఆధ్యాత్మిక చింతనతో ఉంటాడు. మొత్తానికి టీజర్ తో సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్టు ఉదన్న ఫీలింగ్ కలిగించాడు. ఇక సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతుంది. సినిమాలో ఆది చాలా ఈజ్ తో నటించాడని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.


ఆదికి జోడీగా మిస్తీ చక్రవర్తి నటిస్తుంది. అభిమన్యు సింగ్ విలన్ గా చేస్తున్నాడు. మొత్తానికి ఆది ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో బుర్రకథగా వస్తున్నాడు. బుర్ర కథ టైటిల్ వినగానే ఎక్కడికో వెళ్లిపోవచ్చు కాని రెండు బుర్రలు కలిగిన ఓ వ్యక్తి కథే ఈ బుర్రకథ సినిమా. సినిమా కథ మొత్తం టీజర్ లో చెప్పినా థియేటర్ కో ఇంకొన్ని సర్ ప్రైజులు ఉన్నాయని చెప్పొచ్చు. ఆది సాయికుమార్ కొద్దిపాటి గ్యాప్ తో చేసిన ప్రయత్నం బుర్రకథ.


మరి ఈ సినిమా అయినా ఆది కోరుకునే సూపర్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా ఆది మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా ఆది చేస్తున్న ఈ ప్రయత్నాలు మెచ్చుకోదగినవే. అయితే బుర్రకథ మాత్రం అతను కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సూపర్ హిట్ కిక్ మాత్రం ఇచ్చేలా ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: