‘మహర్షి’ మొదటిరోజు మొదటి షో టాక్ ఇంకా తెలియకుండానే ఈసినిమాకు విశాఖ తీరంలో ఊహించని ఎదురీత ఎదురుకావడం సంచలనంగా మారింది. టాప్ హీరోలకుసంబంధించి టికెట్ ధరలను 30 నుంచి 100 దాకా అదనంగా పెంచేసి మొదటి రెండు వారాలలో ఎంత వరకు వీలైతే అంత రాబట్టుకునే పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. 

అయితే సమైఖ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత తెలంగాణాలో బెనిఫిట్ షోలకు అదేవిధంగా విపరీతంగా ధరలు పెంచుకునే విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వడంలేదు. అయితే ఇలాంటి  అనుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సులువుగానే ఇస్తున్నారు. 

అయితే ‘మహర్షి’ కి ఇప్పుడు అనుకోని విధంగా విశాఖ తీరంలో ఈ టిక్కెట్ల పెంపు విషయమై ఎదురీత మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ‘మహర్షి’ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చినా అక్కడి సింగల్ స్క్రీన్ ధియేటర్ల ఓనర్లు దానికి అంగీకరించడం లేదు అని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం ఇలా టిక్కెట్లు ధర పెంచితే ఆ టిక్కెట్ల ధరలు మల్టీ ప్లెక్సుల రేట్లుతో ఇంచుమించు సరిసమానంగా అయిపోతాయి కాబట్టి సగటు ప్రేక్షకుడు సాధారణ ధియేటర్ల కంటే మల్టీ ప్లేక్స్ ల వైపు మొగ్గు చూపుతాడనీ వైజాగ్ ధియేటర్స్ ఓనర్స్ బాదిస్తున్నట్లు సమాచారం. దీనితో ఈప్రాంతం ధియేటర్స్ ఓనర్స్ తో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్న దిల్ రాజ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నట్లు టాక్. ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు హీట్ వేవ్ తో సతమతమవుతుంటే ఆ వేవ్ ను పట్టించుకోకుండా ‘మహర్షి’ వేవ్ మన తెలుగు రాష్ట్రాలలోని యూత్ ను షేక్ చేస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: