"పాయల్ రాజ్ పుత్"... ఆర్.ఎక్స్.100 సినిమాలో హీరో కార్తికేయ కంటే ఎక్కువగా వినిపించిన పేరు. అంతేకాదు..ఈ సినిమా థియోట్రికల్ ట్రైలర్ రిలీజైనప్పటినుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ బ్యూటి గురించే ఆరా తీశారు. ఇక సినిమా రిలీజైయ్యాక బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మరింత బోల్డ్ గా నటించి ప్రేక్షకులతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా తన గ్లామరస్ పర్ఫార్మెన్స్‌తో సినిమా స్థాయిని పెంచేసింది. 
అయితే ప్రతీ సినిమాలో ఇలా బోల్డ్ గా నటించనని మొదట్లో ఎన్ని సినిమాలు తన ముందుకు వచ్చినప్పటికి ఏ ఒక్కటి ఒప్పుకోలేదు. దాంతో పాయల్ గ్లామర్‌కే పరిమితం కాదని అందరికి అర్థమైపోయింది. అందుకే "విక్టరి" వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న "వెంకీ మామ" చిత్రంలో వెంకీ కి జోడిగా నటించే అవకాశాన్ని అందుకుంది. అంతేకాదు మాస్ మహారాజ రవితేజ సరసన కూడా ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న "సీత" సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఓ ఐటం సాంగ్ లో నర్తించింది. 
అటు స్టార్ హీరోలతో జత కడుతూనే, ఐటం సాంగ్స్ కు సై అంటున్న పాయల్ కుర్ర హీరోల పక్కన నటించడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. అలా ఓ కుర్ర హీరోతో నటిస్తున్న సినిమా ఆర్.డి.ఎక్స్...అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరు ఆర్.ఎక్స్.100 కి సీక్వెల్ అని ఫిక్స్ అయ్యారట. ఈ విషయం తెలుసుకున్న పాయల్ ఇది ఏమాత్రం ఆర్.ఎక్స్.100 కి సీక్వెల్ కాదని ఈ సినిమా కంప్లీట్‌గా వేరే కథ అని క్లారిటీ ఇచ్చింది. ఇక వెంకీ మామ సెట్లో జాయిన్ అయిన పాయల్ మరో సారి తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: