ఈ సంవంత్సరం వేసవి సెలవుల్లో చిన్నా పెద్ద ఎంజాయ్ చేసే సినిమాల్లో ఒకటిగా వచ్చిన  'అవెంజర్స్ ఎండ్ గేమ్' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరిస్తున్నారు.  భారీ అంచనాలతో  బరిలోకి దిగిన ఎండ్ గేమ్ విడుదలైన నాలుగు రోజుల వరకు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ క్రేజ్ చూసిన ఎవరైనా అవెంజర్స్ ఎండ్ గేమ్ 2000 కోట్లు కళ్లగొట్టడం ఖాయమనే అన్నారు.  


ఈ మూవీ అన్ని బాషల్లో విపరీతంగా ఆకర్షిస్తుంది. దాంతో కలెక్షన్లపై మంచి ప్రభావం పడింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.  'అవతార్' రికార్డులను బద్దలు కొట్టాలనే పట్టుదలతో పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 'అవతార్' 19,321 కోట్లను వసూలు చేసింది. తెలుగు, బాలీవుడ్, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా మాములుగా రాలేదు. 


ఒకదశలో అవెంజర్స్ ఎండ్ గేమ్ కి భయపడి చాలామంది స్టార్లు తమ సినిమాలను దాదాపుగా నెలరోజుల పాటు వాయిదా వేసుకున్నారు. నిన్న సెకండ్ వీకెండ్ ని లో అవెంజర్స్ ఎండ్ గేమ్ కొల్లగొట్టిన కలెక్షన్స్ చూస్తే.. అవతార్ ని బీట్ చేస్తుందేమో అని  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 12,590 కోట్లను వసూలు చేసిన 'అవెంజర్స్  ఎండ్ గేమ్' .. ఈ వారాంతంలో 'స్టార్ వార్స్' రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. 


 ఇక భారత్ లో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజునే 50 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు నాటికి 200 కోట్లు..10వ రోజు నాటికి 300 కోట్లను కొల్లగొట్టేసింది.  ఇక తెలుగులో రేపు గురువారం మహర్షి వచ్చే వరకు అవెంజర్స్ కలెక్షన్స్ కి ఢోకా లేదు. మొత్తానికి హాలీవుడ్ రేంజ్ ఏంటో అవేంజర్స్ మరోసారి నిరూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: