అక్కినేని వారి ఇంట పుట్టింది రొమాన్స్ అంటారు. అంతలా రొమాంటిక్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఆ ఫ్యామిలి. నాగేశ్వరరావు తరువాత నాగార్జున, ఇపుడు చైతన్య ప్రేమ పాత్రలకు సరిగ్గా సూట్ అవుతారు. రొమాన్స్ చేయాలంటే వాళ్ళే అనేటంతగా ఉంటారు. ఇక నాగ్ వయసు ఇపుడు అరవై. ఈ ఏజ్ లో కూడా తన గ్లామర్ తగ్గకుండా చూసుకుంటున్న ఆయన మన్మధుడు 2 మూవీని  తాజాగా చేస్తున్నారు.


ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇంటెరెస్టింగ్ గా ఉంటున్నాయి. ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ రకుల్ ప్రీత్ సింగ్ చేయడం పెద్ద సెన్సేషన్ అయితే చాలా మంది  అందాల భామలు మిగిలిన రోల్స్ లో  కనిపిస్తున్నారు. తమిళ హాట్ బేబీ అక్షయ గౌడ నాగ్ పక్కన మెరియనుంది. అలాగే నాగ్ కోడలు సమంత కూడా ఇందులో కీ రోల్ ప్లే చేయనుంది.


అన్నిటికీ మించి ఇంకో న్యూస్ ఇపుడు బయటకు వచ్చింది. అదేంటంటే మన్మధుడు 2 లో కీర్తి సురేష్ నటిస్తోందని.  కీర్తి సురేష్ కూడా స్పెషల్ కేమియో రోల్ చేయనుంది అనే వార్తలు వస్తున్నాయి. గ్లామర్ కు కొదువలేని ఈ సినిమా ఖచ్చితం గా హిట్ అవుతుంది అని ఇప్పటినుంచే పండుగ చేసుకుంటున్నారు అక్కినేని ఫాన్స్. చూడాలి మరి అరవయ్యేళ్ళ మన్నధుడు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: