సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. మే 9న అంటే ఈ గురువారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహర్షి సినిమాపై ఘట్టమనేని ఫ్యాన్స్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలిసిందే. వారి అంచనాలను కచ్చితంగా అందుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.


అయితే మహేష్ ఫ్యాన్స్ ను ఉడికించేందుకు మహర్షి మీద వేరే హీరోల ఫ్యాన్స్ నెగటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి సినిమా మే 26 కల్లా అమేజాన్  ప్రైం లో వస్తుందని అంటూ ట్రోల్ చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ రూపంలో స్టార్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఫలితంపై నెగటివ్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది కాకుండా స్టార్ హీరోల సినిమాలకు అమేజాన్ నెల నెల్లన్నర దాకా టైం ఉంటుంది.  


ఈమధ్యనే మజిలీ సినిమా రిలీజ్ టైంలోనే సినిమాకు కనీసం 80 రోజుల టైం గ్యాప్ తో రావాలని అనుకున్నారు. అయితే మజిలీ ఇప్పటికే అమేజాన్ ప్రైం లో వచ్చేసింది. మరి అగ్రిమెంట్ పరిస్థితిఏంటో తెలియాల్సి ఉంది. మహర్షి మూవీ మే 26 న అమేజాన్ ప్రైం లో వస్తుందని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనికి గల కారణం ఎన్.టి.ఆర్ బయోపిక్ టైంలో బాలకృష్ణ సినిమా గురించి ట్వీట్ చేసిన మహేష్ యాత్ర గురించి స్పందించలేదు. అందుకే వైఎస్ ఫ్యాన్స్ అలా చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.


ఏది ఎలా ఉన్నా మరో రెండు రోజులు వెయిట్ చేస్తే మహర్షి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరేం అనుకున్నా సినిమా హిట్టయ్యాక మహేష్ ఫ్యాన్స్ హంగామాని మాత్రం ఎవరు ఆపలేరు. రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్న మహేష్ తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని గట్టిగా చెబుతున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: