స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 11న ఈ మూవీకి సంబంధించి ఒపేనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబోకు సూపర్ క్రేజ్ ఉంది. బన్నీకి ఆర్య వంటి అదరగొట్టే హిట్ ఇచ్చిన సుకుమార్ ఆర్య 2 తో మరో హిట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు కలసి మూవీ చేస్తే అది బంపర్ హిట్ అన్న టాక్ ఉంది. దాంతో ఈ ఇద్దరూ మరో మారు పనిచేయడానికి రెడీ అయిపొయారు.


గతేడాది రంగస్థలం చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకుని ఊపుమీదున్నాడు దర్శకుడు సుకుమార్. తరువాతి ప్రాజెక్టును మహేశ్‌బాబుతో వర్కౌట్ చేసుకున్నా, కథ విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు ప్రాజెక్టును ముందుకు కదలనివ్వలేదు. రెండు వర్షన్స్ వినిపించినా మహేష్‌కు సంతృప్తి కలగకపోవడంతో ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చింది. మహేశ్‌తో ప్రాజెక్టు మొదలుపెట్టే విషయంలో ఆలస్యం కావడంతో, అల్లు అర్జున్‌ను లైన్‌లో పెట్టాడు సుకుమార్. 


ఇప్పటికే త్రివిక్రమ్ ప్రాజెక్టుతో బిజీగా వున్న బన్నీ, ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన తరువాతే సుక్కూతో సెట్స్‌పైకి వెళ్తాడు. అంటే  త్రివిక్రమ్ ప్రాజెక్టు పూర్తి అయితే కానీ  బన్నీ-సుక్కూల ప్రాజెక్టు రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలు లేవు. దసరాకు త్రివిక్రమ్  మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దాంతో ఆ తరువాత సుక్కు తో మూవీ సెట్స్ మీదకు వస్తుంది. వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేసెలా ప్లాన్ చేసుకుంటున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: