సంచలనాల దర్శకుడు "రాం గోపాల్ వర్మ" ఎప్పుడు ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు "వర్మ" అని.  "శివ" సినిమా తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటిని సంపాదించుకున్నాడు. అంతేకాదు అక్కినేని నాగార్జునకి తన ఫిల్మోగ్రఫీలో ఎప్పటికి గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. ఈ ఒక్క సినిమాతో చిత్ర పరిశ్రమలో రాం గోపాల్ వర్మ పేరు మార్మోగిపోయింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోను స్టార్ డైరెక్టర్ హోదాను సంపాదించుకున్నాడు. 


తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్నారు. వారిలో ముఖ్యంగా పూరి జగన్నాథ్, హరీష్ శంకర్..వంటి టాప్ డైరెక్టర్స్ ఉండటం విశేషం. సత్య, రంగీలా, సర్కార్ వంటి సినిమాలతో రాం గోపాల్ వర్మ ఎవరికి దక్కని స్టార్ డం ని సంపాదించుకోవడం ఒకెత్తైతే తన ఆఫీస్ ముందు ప్రొడ్యూసర్స్ సూట్‌కేసులతో అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండటం మరోక ఎత్తు. అందుకు కారణం తను ఎంచుకునే కథ, కథనాలు. సొంతగా కథ రాసుకునే వర్మ ఆ కథను స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే వర్మ తీసిన "శివ" సినిమాలో షాట్స్ అంతకముందు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఎంతోమంది దర్శకులు ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయ్యారు కూడా. ఇంత టాలెంట్ ఉన్న వర్మ ఎప్పటికప్పుడు సంచలనాలను క్రియోట్ చేస్తూ వస్తున్నాడు. 


వర్మ తీసిన ఫ్లాప్ సినిమాల నుండి "GST"వరకు అన్నీ సంచలనాలే. సినిమా సెలబ్రిటీస్ నుంచి పొల్టీషియన్స్ వరకు ఎవ్వరినీ వదిలి పెట్టకుండా కామెంట్ చేస్తుంటాడు. అందుకే  ఇంత బిజీగా వున్న వర్మకి గత కొంత కాలంగా సొంత కథ రాసే టైం లేక బయోపిక్ ల వెంట పడుతున్నాడు. వంగవీటి, రక్త చరిత్ర వంటి నిజ జీవిత కథలను తెరకెక్కించి సంచలనాలను సృష్ఠించిన వర్మ ఇప్పుడు బయోపిక్ మీద బయోపిక్ లను తెరకెక్కిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: