సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే మహర్షి సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. మే 9 తర్వాత మహేశ్ మహర్షి సినిమాకు పోటీగా ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. చిన్నా చితకా సినిమాలు ఉన్నా వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరనే విషయం అందరికి తెలిసిందే. దీంతో.. ఓ మాదిరి టాక్ వచ్చినా మహర్షి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రావడం పక్కా.


మరోవైపు ఐపీఎల్ కూడా ఎండ్ కు వచ్చేసింది. ఆ తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉన్నా దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోపు సమ్మర్ హాలిడేస్ లో కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా దాదాపు నెలరోజుల పాటు మహేశ్ మహర్షి సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. అందుకోసమే మహేశ్ మహర్షి సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


ఇక అన్నింటికి మించి ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండడండతో.. థియేటర్లకు కూడా వచ్చిన ప్లాబ్లమ్ ఏం ఉండదు. జనాలు వచ్చినంతకాలం నిర్మాతలకు నచ్చినంత కాలం థియేటర్లో సినిమాను ఆడించుకోవచ్చు. దీంతో.. మహర్షి సినిమా తన కెరీర్లో మరో హిట్ అని అప్పుడే పార్టీలు చేసుకుంటున్నాడు మహేశ్.

మరింత సమాచారం తెలుసుకోండి: