టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న రాజబాబు అప్పట్లో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్నారంటే ఆయన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవొచ్చు.  రేలంగి, రాజబాబు, పద్మనాభం ఈ ముగ్గురు కమెడియన్లు లేని సినిమాలు ఉండవంటే అతిశయోక్తి లేదు.  రాజబాబు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు..ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలు నిర్మించారు.  నిర్మాణ రంగంలోకి వచ్చిన తరువాత ఆయన ఎన్నో కష్టాల్లో పడ్డారని..చివరి దశలో చాలా ఇబ్బందులు పడ్డారని కథనాలు వచ్చాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు మాట్లాడుతూ..తాను సినిమాల్లోకి ఎలా వచ్చానన్న విషయం చెప్పారు.  


కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉండగానే ఆయన తమ్ముడు చిట్టిబాబు ని సినిమాల్లోకి తీసుకున్నారు.  నాగేశ్వరరావు హీరోగా నటిస్తున్న ‘పల్లేటూరి బాబు’షూటింగ్ సమయంలో ఆయన బావమరిదిగా నటించారు రాజబాబు.  అయితే చిట్టిబాబును రమాప్రభ తమ్ముడిగా ఓ క్యారెక్టర్ కోసం తన తమ్ముడు నటిస్తాడని దర్శక, నిర్మాతలను ఒప్పించారు.  అయితే తనకు సినిమాల్లో నటించడం కష్టమని చెప్పినా బలవంతంగా నటింపజేశారు. ఆ సినిమాలో నాది రిక్షావాడి వేషం .. నాకేమో రిక్షా రాదు. దాంతో స్నేహితుల సహకారంతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రిక్షా తొక్కడం నేర్చుకున్నాను.


ఇక ఓ సన్నివేశంలో రమాప్రభ, రాజబాబుని రిక్షా ఎక్కించుకొని తొక్కాలి..నాకేమో రిక్షా తొక్కడం రాదు..అందుకోసం నా  స్నేహితుల సహకారంతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రిక్షా తొక్కడం నేర్చుకున్నాను.  ఈ సన్నివేశాన్ని శ్రీనగర్ కాలనీలో చిత్రీకరిస్తున్నారు. అది ఎత్తైన ప్రదేశం కావడంతో రిక్షా తొక్కలేకపోతున్నాను. నా బాధ చూసి  మా అన్నయ్య ఇబ్బంది పడ్డారు..వెంటనే దర్శకుడి  ప్రత్యగాత్మ తో ఇంత హైట్ లో పెడితే వాడు ఎలా తొక్కుతాడు? వాడికి రిక్షా తొక్కడమే అలవాటు లేదు' అని అన్నాడు. దాంతో ఆయన డౌన్ లో తొక్కమని చెప్పి ఆ షాట్ తీశారు" అని చెప్పుకొచ్చారు.  మా అన్నయ్య అన్ని విషయాల్లో మాకు సహకరించి ఇంత పొజీషన్ కి తీసుకు వచ్చారని చిట్టిబాబు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: