'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి.. ఎన్టీఆర్- చరణ్ లతో కలిసి ‘RRR’ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కాలికి గాయం అయింది. దీంతో షూటింగ్ దాదాపు రెండు వారాలు వాయిదా వేయడం జరిగింది. ఇదే సమయంలో తారక్ కి కూడా చేతికి గాయం అయింది..ప్రస్తుతం తారక్ విశ్రాంతి లో ఉన్నారు.

Image result for rajamouli ram charan

అయితే కాలికి గాయం అయిన చరణ్ మాత్రం నొప్పిని ఏమాత్రం లెక్కచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఉన్న గాయాన్ని ఇంకా పెద్దగా చేసుకుంటున్నట్లు తెగ టాక్ వినపడుతుంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో మెగా అభిమానులను కాలి గాయం ఉండగానే వారితో చట్టాపట్టాలేసుకుని ఫోటోలు దిగి పోస్ట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి రాంచరణ్ విశ్రాంతి తీసుకోకుండా ఇలా వ్యవహరించడంపై కొద్దిగా అసంతృప్తి చెందినట్లు...అనుకున్న టైం కి సినిమా విడుదల అవ్వాలంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉండగా...ఇద్దరి హీరోలకు గాయమవడంతో సినిమా అనుకున్న టైంకి అవుతుందా అన్న డైలమాలో రాజమౌళి పడినట్లు ఇండస్ట్రీలో తెగ వార్తలు వినబడుతున్నాయి.

Image result for Ram Charan Leg Injury

ఈ సినిమాపై మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదట అనుకున్న టైం ప్రకారం వచ్చే సంవత్సరం జులై మాసం లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: