మహేష్ కెరీర్ లో ఘోరమైన ఫెయిల్యూర్ మూవీ స్పైడర్. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా చివరికి అభిమానులకు కూడా నచ్చలేదు. అయితే ఊరికే లైన్ చెప్పి, కాసేపు నరేషన్ ఇచ్చి, సగం సగం స్టోరీలు వినిపిస్తే తాను సినిమాలు చేసే ప్రసక్తే లేదని అతను తేల్చి చెబుతున్నాడు. ‘మహర్షి’ సినిమాను పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ అయ్యాకే ఓకే చేసినట్లు అతను వెల్లడించలేదు. మరి ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి అని అడిగితే.. అతను ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ సినిమాలను ఉదాహరణగా చెప్పడం గమనార్హం.


20 నిమిషాలు లైట్‌గా కథ చెప్పడం.. స్క్రిప్టు రెడీ కాకముందే షూటింగుకి వెళ్లిపోవడం.. ఆ తర్వాత బెటర్మెంట్స్ చేయడం.. ఔట్ పుట్ తేడా కొట్టడం.. ఇలాంటి వ్యవహారాలకు తాను ఇకపై దూరంగా ఉండాలని అనుకుంటున్నాన్నట్లు అతను చెప్పాడు.‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ కథల్ని 20 నిమిషాలు విన్నపుడు చాలా బాగా అనిపించాయని, కానీ సెట్స్‌కు వెళ్లాక వాటి ఫలితం గురించి ముందే అర్థమైపోయిందని మహేష్ తెలిపాడు.


దీన్ని బట్టి ఇటు శ్రీకాంత్ అడ్డాల, అటు మురుగదాస్.. పూర్తి స్క్రిప్టులు మహేష్‌కు ఇవ్వకుండానే సినిమాలు మొదలుపెట్టారని స్పష్టమవుతోంది. శ్రీకాంత్ అనేవాడు చిన్న స్థాయి దర్శకుడే కాబట్టి మహేష్ మాటలకు పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. కానీ మురుగదాస్ అనేవాడి రేంజే వేరు. మహేష్ తన గురించి ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఇలాంటి పంచ్ వేస్తాడని ఆయన ఊహించి ఉండడు. ఈ విషయం ఆయన వరకు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో మరి? ‘స్పైడర్’ ప్రమోషన్ల టైంలో మళ్లీ మళ్లీ మురుగదాస్‌తో పని చేస్తానన్నాడు మహేష్. కానీ ఇప్పుడు అతడి మాటల్ని బట్టి చూస్తే మురుగదాస్‌తో ఇంకో సినిమా ఉండే ఛాన్సే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: