కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన  దాసరి నారాయణరావు జయంతిని ‘దర్శకుల దినోత్సవం గాజరుపుకున్న నేపధ్యంలో  ఆ ఫంక్షన్ కు వచ్చిన మోహన్ బాబు  దాసరి ఆస్తుల పంపకానికి సంబంధించి చేసిన  వ్యాఖ్యల పై దాసరి అభిమానులు విమర్శలు చేస్తున్నారు. దాసరి నారాయణరావు ఆస్తుల పంపకాల బాధ్యతను తనకూ అలాగే మురళీమోహన్‌కీ  అప్పగించారు  అని  మోహన్ బాబు  చెపుతూ  ఆ పంపకాల ప్రక్రియ సరిగ్గా చేపట్టలేకపోయామనీ అందుకు వేరే కారణాలున్నాయని మోహన్‌బాబు చెప్పడం వెనుక కారణాలు ఏమిటి అంటూ దాసరి అభిమానులు మధన పడుతున్నారు.

అంతేకాదు దాసరి పుట్టినరోజునాడు జరుగుతున్న ఆ ఫంక్షన్ లో  అనవసరంగా  దాసరి నారాయణరావు అస్తుల పంపకాల వ్యవహారం ఎందుకు చర్చకు తేవడం అంటూ దాసరి అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు ప్రతి కుటుబంలోను సర్వసాధారణంగా కనిపించే ఇలాంటి సమస్యలను పెద్ద సమస్యలుగా మారాయా? అన్న సందేహాలు  మోహన్ బాబు మాటలలో వ్యక్త మవుతుంది అన్నది దాసరి అభిమానుల వాదన.

దాసరి మరణానంతరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ  పెద్ద దిక్కుని కోల్పోయింది అన్న భావన ఇప్పటికి అందరి భావనలలో కొనసాగుతోంది.  అలాంటి పరిస్థితులలో దాసరి ప్రియ శిష్యుడిగా  పేరు గాంచిన  మోహన్‌ బాబు దాసరి ఆస్తుల పంపకాల వ్యవహారం గురించి ఒక ఫంక్షన్ లో బహిరంగంగా ప్రస్తావన తీసుకురావడం దాసరి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని టాక్.

అయితే ఈ  విషయమై  మోహన్ బాబు సన్నిహితులు మాత్రం వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దాసరి కోడలు మీడియా ముందుకొచ్చి మోహన్ బాబు తన కుటుంబానికి ఆస్తుల పంపకం విషయమై అన్యాయం చేశారని ఆరోపణలు చేసిన నేపధ్యంలో  ఆమె ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే వ్యూహంలో మోహన్ బాబు ఇలా దాసరి జయంతిరోజున ఇలా దాసరి ఆస్తుల పంపకాల ప్రస్తావన తీసుకువచ్చి ఉంటారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. . 


మరింత సమాచారం తెలుసుకోండి: