ప్రవీణ్ సత్తారు- సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన "రొటీన్ లవ్ స్టోరీ" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా చెన్నై భామ రెజీనా, ఆ చిత్రం విజయం అందించక పోయినా మంచి అవకాశాలనే అందుకుంది. అయితే ఎందుక‌నో రెజీనా స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఎన్నిసార్లు ట్రై చేసిన పెద్ద స్టార్స్ పక్కన అవకాశం కలగపోవడంతో తమిళంలో ట్రై చేసింది ఈ ముద్దుగుమ్మ 

అయితే తమిళంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవడంతో రెజీనా కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారంతా, అయితే తాజగా రెజీనా మలయాళంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దమయింది, అయితే ఈ చిత్రంలో హీరో మరెవరో కాదు మలయాళ  సూపర్ స్టార్ మోహన్ లాల్. మాలీవుడ్ లోని మొదటి చిత్రమే మోహన్ లాల్ తో నటిస్తుండడంతో మలయాళంలో నైనా తనకి మంచి అవకాశాలు వస్తాయేమో అని ఆశ పడుతోంది రెజీనా. 

"బిగ్‌బ్ర‌ద‌ర్" అనే పేరుతో తెరకెక్కువుతున్న ఈ  సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తెలుగు-తమిళ భాషల్లో నెరవేరని తన ఆశ   మ‌ల్లువుడ్‌లో అయినా తీరుతుందో లేదో చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: