తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఆయన నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది ‘గబ్బర్ సింగ్’. ఆ తర్వాత ఆయన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా నటించారు..అయితే ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకున్నా..మ్యూజిక్ మంచి హిట్ అయ్యింది.   ఈ చిత్రంతో పవన్ కళ్యాన్ కి ఒక్కసారే మాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 


‘గబ్బర్ సింగ్’ ఆ తర్వాత ఆయన ‘జనసేన’అనే పార్టీ స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఇక ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఎంతో హిట్ కావడానికి ముఖ్యమైన మరో కారణం సంగీతం.  ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు కొందరు భారత యువకులు చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం ముగ్ధురాలిని చేసింది.

ఓ అంతర్జాతీయ చానల్ లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో జెన్నిఫర్ లోపెజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.  కాగా, ఈ రియాల్టీ షోకి భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన 'ద కింగ్స్' అనే గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది.

ఫినాలే షో సందర్భంగా 'ద కింగ్స్' సర్దార్ గబ్బర్ సింగ్ లోని 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు '300' సినిమా కాన్సెప్ట్ ను మిక్స్ చేసి దుమ్ములేపేశారు. వీరి డ్యాన్స్ చూసి ప్రముక పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఉద్వేగం పట్టలేకపోయారు. తన సీట్లోంచి పైకి లేచి మరీ 'ద కింగ్స్' ఎంకేరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: