క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను రెండు భాగాలుగా తీశాడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి మరియు సినిమా రంగానికి సంబంధించిన బయోపిక్ లను తీసిన బాలకృష్ణ ఆ సినిమాల ద్వారా నందమూరి ప్రేక్షకులను మరియు తెలుగు సినీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయారు.

Image result for balakrishna

అయితే సినిమా తీసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి హిందూపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల ఫలితాలకు రావడానికి సమయం పడుతున్న నేపథ్యంలో తన తర్వాత సినిమా విషయంలో బాలయ్య బాబు ఇటీవల చాలా తర్జనభర్జనలు పడినట్లు సమాచారం.

Image result for balakrishna

ముఖ్యంగా ఎన్నికల సమయంలోనే బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట అయితే కథ మాత్రం సరిగా లేని నేపథ్యంలో వెంటనే బాలయ్య బాబు బోయపాటి తో చేసే సినిమా విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు తన తర్వాత సినిమాని కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఈ సినిమా ప్రకటన మే 17 వ తారీకున అనగా ఎలక్షన్ ఫలితాలు రాకముందే సినిమా మొదలుపెట్టే ఆలోచనలో బాలయ్య బాబు ఉన్నట్లు తెలుగు సినిమా రంగంలో వినబడుతున్న సంచలన న్యూస్.



మరింత సమాచారం తెలుసుకోండి: