ఒక సినిమా రూపొందాలంటే ఆ కథకు తగ్గ నటీనటుల ఎంపికలో దర్శక, నిర్మాతలు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది.  ఆ పాత్రలకు అలాంటి వారే సూట్ అవుతారని గట్టిగా నమ్ముతుంటారు కొంత మంది సీనియర్ దర్శకులు.  టాలీవుడ్ లో ఎన్నో గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించిన కోడీ రామకృష్ణ ‘అరుంధతి’లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించారు.  రెండు జన్మలతో ఓ నరరూప రాక్షసుడిని ఎలా హతమార్చింది అన్న కాన్సెప్ట్ పై లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘అరుంధతి’ఎన్నో అవార్డులు గెల్చుకుంది.  ఈ సినిమాతో అనుష్కకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.  అయితే  ఈ సినిమాలో ఛాన్స్ అనుష్కకు నేరుగా రాలేదు..ఎంతో మంది హీరోయిన్లను జల్లెడ పట్టిన తర్వాత వచ్చింది.


ఈ సినిమాలో జేజెమ్మ పాత్రలో మొదట మంచు లక్ష్మిని తీసుకోవాలని అనుకున్నారట..అయితే ఆమె అమెరికాలో ఉండటంతో డేట్స్ కుదరక క్యాన్సిల్ అయ్యిందట.  ఆ తర్వాత మమతా మోహన్‌దాస్‌ను కూడా చిత్ర బృందం సంప్రదించింది. క్యాన్సర్‌ కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పడంతో అనుష్కను తీసుకున్నారు.  కాకపోతే అనుష్కను వెంటనే ఆ పాత్రకు సెలక్ట్ చేయకుండా ఆమెపై ఎన్నో డమ్మీ షూట్స్ చేశారట. ఇక జేజమ్మ పాత్ర ప్రాముఖ్యత కనుక కేరళ నుంచి డిజైనర్లను రప్పించారట నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి.  ఆ కాస్ట్యూమ్స్ అనుష్క ధరించిన తర్వాత అందరూ బాగుందని మెచ్చుకుంటే, శ్యాంప్రసాద్‌రెడ్డి మాత్రం ఇక్కడ బాగానే ఉంటుంది...తీరా  సెట్‌లోకి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అని సెట్‌కు తీసుకెళ్లారట.  


కానీ సెట్స్ పై షూటింగ్ తీస్తున్న సమయంలో ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి అసహనం చూపించారట. సరిపోకపోవడంతో వాటిని పక్కన పెట్టేసి, కొత్త కాస్ట్యూమ్స్‌ను తయారు చేయించారు. ఇందు కోసం మూడు, నాలుగు నెలలు సమయం తీసుకున్నారు. ఆ తర్వాతే స్వీటిని ఓకే చేశారు.  ఇలా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తెరపై మనం జేజమ్మను చూడగలిగాము..అందుకే ఆ పాత్రకు అంతగా పేరు వచ్చింది.  టాలీవుడ్ మూవీ చరిత్రలో ‘అరుంధతి’చిరస్థాయిగా నిలిచిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: