"ఆర్య" టాలీవుడ్ కి సుకుమార్ లాంటి టాలెంటెడ్ దర్శకుడిని పరిచయం చేసిన చిత్రం.  "ఆర్య" తెలుగు తెరకు లవ్ స్టోరీస్ పై కొత్త ట్రెండ్ ని అందించిన చిత్రం. "ఫీల్ మై లవ్" పేరుతో "ఆర్య" పాత్రలో అల్లుఅర్జున్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ని నచ్చని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు, ఇక నిన్నటితో 15  సంవత్సరాలు పూర్తి చేసుకున్న "ఆర్య" గురించి అల్లు అర్జున్ స్పెషల్ గా ట్వీట్ చేశారు. 

" నా జీవితంలో ‘ఆర్య’ మ్యాజికల్‌ మూవీ.. ఒక విధంగా చెప్పాలంటే నా జీవితాన్ని మార్చేసిన సినిమా, "ఆర్య" విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను.  సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌రాజు లకి ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ సోషల్ మీడియాలో తన సందేశాన్ని పంచుకున్నారు. 

ఈ సినిమాకు సీక్వెల్‌గా 2009లో సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో "ఆర్య 2" వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా పది సంవత్సరాల తర్వాత  ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది.  ముచ్చటగా మూడోసారి కూడా బన్నీ- సుకుమార్ సూపర్ హిట్ కొడతారలో లేదో  వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: