రాం గోపాల్ వర్మ దగ్గినా తుమ్మినా సంచలనమే. ఎందుకంటే ఆయన ఏ యాంగిల్ లో దగ్గారు, ఏ స్టైల్ లో తుమ్మారు...అని జనాలు తమ పనులు మానుకొని మరీ యూట్యూబ్, గూగుల్ లో సర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే శివ సినిమాతో మొదలు పెట్టిన కాంట్రవర్సీ కంటెంట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. చిన్న సందర్భం దొరికితే చాలు ట్వీట్లతో చంపేస్తుంటాడు. ఎవర్నైనా తిట్టాలి అనుకుంటే ముందు తనని తాను తిట్టుకున్నాక పక్కన వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. అదీ వర్మ స్టైల్. 


మాఫియా బ్యాగ్డ్రాప్ లో సినిమా తీయడంలో వర్మ స్టైలే వేరు. "రా" కంటెంట్ ను స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. టాలీవుడ్, బాలీవుడ్ లో వర్మ సినిమాలకున్న క్రేజ్ మరే దర్శకుడి సినిమాలకి ఉండదు అన్న సంగతి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలిసిన విషయమే. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవడంలో వర్మని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా తన మైండ్‌లో వచ్చిన పాయింట్‌ను నచ్చినట్టుగా తీసుకుంటూ వెళతాడు. మీకు నచ్చితే నా సినిమాలు చూడడండి లేకపోతే మానేయండి..అని పొగరుగా సమాధానమిస్తాడు. ఆ సమాధానమే ప్రేక్షకులను థియోటర్ల వరకు రప్పిస్తుంది. ఎన్ని హిట్స్ ఇచ్చాడో అంతకంటే ఎక్కువ డిజాస్టర్లు ఇచ్చాడు. అయినప్పటికి వర్మ ఎప్పుడు సేఫ్ గానే ఉంటాడు. అది అతని కెపాసిటి. 


వర్మ నుండి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. సత్య, రంగీలా, సర్కార్, వంగవీటి, రక్త చరిత్ర తీసిన వర్మ మధ్యలో దెయ్యాల సినిమాలు తీస్తాడని ఎవరైనా అనుకుంటారా... "GST"తీస్తాడని ఏ ఒక్కరైనా ఊహిస్తారా...ఊహిస్తే అతను రాం గోపాల్ వర్మ ఎందుకవుతాడు. అందుకే ఎవరు ఊహించని "GST" తీసి అందరు కరెంట్ స్థంభాలు ఎక్కేలా చేశాడు. ఈ "GST" తో యూత్ కి జీవితం అంటే ఏంటో ఓ క్లారిటీ వచ్చిందనడంలో అసలు సందేహం లేదు. ఈ "GST" తీసిన టైం లో జరిగిన డిబేట్స్ లో వర్మ "GST-2"కూడా తీస్తానని నిర్మొహమాటంగా చెప్పాడు. 


కానీ ఆతర్వాత బయోపిక్ ల వెంటపడి " లక్ష్మీస్ NTR" తీశాడు. "శశికళ" తీస్తున్నా అన్నాడు, కె.సి.ఆర్ బయోపిక్ తీస్తా అంటున్నాడుగానీ "GST-2" తీయబోతున్నా.. అని మాత్రం చెప్పడం లేదు. పాపం "GST"చూసినప్పటి నుండి 20 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వర్మ ఫ్యాన్స్ "GST-2"ఎప్పుడు తీస్తారు సార్..! అని ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ కోసం వర్మ "GST-2"ఎప్పుడు తీస్తాడో..ఈ సారి ఏ మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: