పెద్ద పెద్ద హీరోల‌తో క‌లిసి న‌టించినా కొంద‌రికి ఎందుకో ఆశించినంత‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు రావు. అలాంటి కోవ‌కు చెందిన భామ అనుఇమ్మాన్యుయేల్‌. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌ లాంటి టాప్ హీరోలతో న‌టించినా లక్ మారలేదు.  'అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, ఫ్లాప్ అవ్వ‌గా శైలజారెడ్డి అల్లుడు ప‌ర్వాలేద‌ని పించుకుంది.


తాను న‌టించిన‌ సినిమాలు అన్నీ వరుసగా విఫలమవడంతో ఆమె కెరీర్ గాడి తప్పింది.  చాలా కాలం ఆమె గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.  ఈ లాంగ్ గ్యాప్ తరవాత ఆమెకు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమా చేసే ఛాన్స్ దొరికింది. 


పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాలో ఉండ రానుంది.  ఒకరకంగా ఇది ఆమెకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అవ‌కాశాలు వ‌చ్చినా అదృష్టం మాత్రం వ‌రించ‌డం లేదు ఈ అమ్మ‌డుని క‌నీసం ఈ చిత్ర‌మైన ఆమెకు హిట్ కావాల‌ని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: