స్టార్ హీరోల తనయుల సినిమాలకు వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. డెబ్యూ మూవీనే హిట్ అందించాలన్న తపన ఉంటుంది. అయితే కొత్త సినిమా తీస్తుంటే ఎలా వస్తుందో ఏంటో అన్న టెన్షన్ ఉంటుంది. అయితే ఆల్రెడీ ఒక భాషలో హిట్టైన సినిమా రీమేక్ చేస్తే ఆ భయం ఎందుకో.. ఇంతకీ ఎవరి గురించి ఈ డిస్కషన్ మీకర్ధమైందనుకుంటా.. తెలుగు హీరో అయినా తమిళంలో సక్సెస్ అయిన చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు.


తెలుగులో సూపర్ హిట్టైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రీమేక్ గా ధ్రువ్ సినిమా వస్తుంది. మొదట బాలా డైరక్షన్ లో వర్మ పేరుతో తీసిన సినిమా మొత్తం చెత్తలో పడేయగా మళ్లీ అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన గిరీశయ్యను ఈ సినిమాకు డైరక్టర్ గా తీసుకుని సినిమా చేస్తున్నారు. ఈసారి వర్మ టైటిల్ కాస్త ఆదిత్య వర్మగా పెట్టారు. ఇదిలాఉంటే ఈ సినిమా షూటింగ్ లో విక్రం ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైందని టాక్.


షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ విక్రం ప్రత్యక్షమవుతున్నాడట. ఈమధ్యనే చిత్రయూనిట్ డెహ్రాడూన్ షూటింగ్ కు వెళ్తే అక్కడకు విక్రం వచ్చాడని తెలుస్తుంది. కొడుక్కి హిట్ రావాలని కోరుకోవడంలో తప్పులేదు కాని సీన్ టూ సీన్.. షాట్ టూ షాట్ అడ్వైస్ ఇస్తుంటే క్రియేటర్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏది ఏమైనా విక్రం చేస్తున్న పనుల వల్ల ఇప్పటివరకు అతనికి ఉన్న మంచి పేరు పోతుంది.


డబ్యూ మూవీతోనే ఏదో సాధించేద్దాం అనుకుంటున్నా సినిమా ఆడినా ఆడకున్నా ఎలాగు తను ఏర్పాటు చేసిన స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి పెద్దగా నష్టం ఉండదు. తెలుగులో కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నా అఖిల్ ఇప్పటికి 3 సినిమాలు చేసినా ఒక్క హిట్టు కొట్టలేదు. కాబట్టి ధ్రువ్ విషయంలో విక్రం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ వంగ హిందిలో రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై సూపర్ అనిపించుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: