తెలుగులో కొందరు హీరోలకు కొన్ని రకాల పాత్రలు నప్పుతాయి. అందులోనే  హిట్లు కూడా ఉంటాయి. నందమూరి బాలక్రిష్ణ విషయానికి వస్తే ఆయనకు పోలీస్ వేషాలు బాగా ప్లస్ అయ్యాయి. బాలయ్య తొలిసారి పోలీస్ పాత్రను పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్లో భలే తమ్ముడు మూవీలో చేశారు. అయితే అది ఫట్ అయింది. ఆ తరువాత చేసిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంచి హిట్ అయింది. ఆ తరువాత రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో బాలయ్య పోలీస్ వేషాలు బాగా నప్పుతాడని పేరొచ్చింది.


ఇక లక్ష్మీ  నరసిమ్హ మూవీ  కూడా బాలయ్య మరో పొలీస్ హిట్. ఇదంతా ఎందుకంటే చాలాకాలమైంది బాలయ్య పోలీస్ వేషం కట్టి. దాంతో బాలయ్య ఇపుడు పాత సెంటిమెంట్ ని మరో మారు నమ్ముకున్నారు. అచ్చి వచ్చిన డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ బాలయ్యని రెండవ మారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన బాలయ్యతో జై సిమ్హా గత ఏడాది తీసి హిట్ కొట్టారు. ఇపుడు ఈ ఇద్దరూ నిర్మాత సీ కళ్యాణ్ తో కలసి కొత్త సినిమా చేస్తున్నారు.


ఇందులో బాలయ్యది కరకు ఖాకీ వేషంట. దీనికి రౌడీ పోలీస్ అని పేరు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంచి ముహూర్తం అని ఈ నెల 17న  మూవీని స్టార్ట్ చేసి రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలుపెడతారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ మూవీ బాలయ్యకు ఎంతటి సక్సెస్ ఇస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: