తమన్నా అంటేనే మిల్కీ బేబీ అంటారు. ఈ పాలమీగడ అందంతో ఎంతో కాలం టాలీవుడ్ ని ఏలేసింది. వానా వానా వెల్లువాయే అంటూ ఆమె చెర్రీతో వేసిన స్టెప్స్, వంటిపై ముత్యాలుగా  మెరిసే వాన నీటితో జలాకాట ఆడిన తీరుకు యూత్ కిర్రెక్కిపోయింది. ఆ ముందూ తరువాత ఎన్నో సినిమాలు చేసిన తమన్నాకు ఇపుడు కొంత గ్యాప్ వచ్చింది. అయినా ఎక్కడా తగ్గేది లేదంటూ సీనియర్ హీరో వెంకటేష్ తో ఈ మధ్య చేసిన ఎఫ్ 2 లో తమన్నా తన సత్తా ఏంటో మరో సారి చాటింది. 


ఇక ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేయడం ద్వారా తన ప్లేస్ కి మళ్ళీ రావాలనుకుంటున్న తమన్నా ఇపుడు రెడీ అంటోంది. తమన్నా పూర్వవైభవం తెచ్చుకునేందుకు హార్డ్‌గా కసరత్తు చేస్తోంది. దాదాపు 30 పదుల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇప్పటికీ తాను యంగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆమె లేటెస్ట్ మూవీ తమిళంలో ‘దేవి 2’ కాగా, తెలుగులో ‘అభినేత్రి 2’. ఐదే, దీనికి సంబంధించి ‘రెడీ.. రెడీ..’ అనే సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.


సింపుల్‌గా చెప్పాలంటే ఈ సాంగ్‌లో ప్రభుదేవాని ఓ రేంజ్‌లో ఆటాడుకుంది. చాలా స్టెప్పుల్లో ప్రభుదేవాని అనుకరించే ప్రయత్నం చేసింది. మ్యూజిక‌ల్ హ‌ర్రర్ కామెడీగా రానున్న ఈ చిత్రానికి ఏఏల్‌ విజయ్‌ డైరెక్టర్. ఆయన చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఫిల్మ్ ఇది. ఈ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీలో తమన్నాకు మంచి ఆఫర్లు వస్తాయని భావిస్తోంది. చూడాలి తమన్నా రెడీగా ఉంది. టాలీవుడ్ ఏమంటోందో.


మరింత సమాచారం తెలుసుకోండి: