సునీల్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతూనే హీరోగా మారి మంచి హిట్స్ ని అందుకున్నాడు. బొద్దుగా ఉన్నప్పటికి డాన్స్ లో మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అద్భుతంగా డాన్సులు చేశాడు. ఫ్లాప్ అంటూ ఎరగని టాప్ డైరెక్టర్ రాజమౌళి సైతం స్టార్స్ తో కాకుండా సునీల్ తో మర్యాద రామన్న సినిమా తీసి సూపర్ హిట్ ని ఇచ్చాడు. అదీ నటుడిగా సునీల్ కున్న క్రేజ్. అయితే ఈ క్రేజ్ అంతా కూడా కొంతకాలమే ఉండింది. ఉన్నట్టుండి సునీల్ ని ఫ్లాప్ లు వెంటాడాయి. ఎంత కష్టపడ్డా కూడా హిట్ కరువైంది. దాంతో సునీల్ తో కమిటైన దర్శక, నిర్మాతలు తమ ప్రాజెక్ట్స్ ని డ్రాప్ చేసుకున్నారు. 


అంతే ఇక సునీల్‌కి హీరోగా అవకాశాలు రావడం కంప్లీట్‌గా తగ్గిపోయాయి. దానికి తోడు యంగ్ హీరోల తాకిడి కూడా గట్టిగానే తగిలింది. అయితే త్రివిక్రం పుణ్యమా అంటూ సునీల్ మళ్ళీ ఇప్పుడిప్పుడే అడపాదడపా తన ముందుకు వచ్చిన క్యారెక్టర్స్ ని చేసుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అల్లరి నరేష్ సునీల్ కి పోటీగా మారాడు. గత కొంత కాలంగా అల్లరి నరేష్ కి కూడా హీరోగా సక్సస్ లు లేవు. దాంతో గమ్యం, శంభో శివ శంభో వంటి సినిమాలలో వచ్చినటువంటి క్యారెక్టర్స్ వస్తే అంగీకరిస్తున్నాడు. అలా ఒప్పుకున్న సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి. 


ఈ సినిమాలో అల్లరి నరేష్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ చేశాడని ఇండస్ట్రీ టాక్. ఇకపై కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అంటున్నాడు నరేష్. ఇదే ఇప్పుడు సునీల్ కి పెద్ద తలనొప్పిగా మారిందట. అల్లరి నరేష్ సునీల్ కి బాగా పోటీ అవుతున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారట. మరి ఎవరు ఎవరికి పోటీ అవుతారో కొంత కాలం ఆగితే తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: