సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. రేపు అనగా గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా అవడం విశేషం. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.


తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ మహర్షి మీద మంచి హోప్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా మహర్షి 94.60 కోట్ల రూపాయల థియేట్రికల్ రైట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బడ్జెట్ కూడా భారీగానే కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో దాన్ని కవర్ చేశారు. అయితే టేబుల్ ప్రాఫిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు అన్నది ఇన్నర్ టాక్.


ఏరియాల వారిగా మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ :


నైజాం : 22 కోట్లు
సీడెడ్ : 12 కోట్లు
ఉత్తరాంధ్ర : 9.10 కోట్లు
ఈస్ట్ : 6.80 కోట్లు
వెస్ట్ : 5.70 కోట్లు
కృష్ణా : 5.80 కోట్లు
గుంటూరు : 7.70 కోట్లు
నెల్లూరు : 3 కోట్లు
ఏపి/తెలంగాణ : 72.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 10 కోట్లు
ఓవర్సీస్ : 12.50 కోట్లు
వరల్డ్ వైడ్ : 94.60 కోట్లు  



మరింత సమాచారం తెలుసుకోండి: