రేపు విడుదల కాబోతున్న ‘మహర్షి’ రిజల్ట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈమూవీ ఇంకా విడుదల కాకుండానే బుల్లితెర పై మరో విధంగా విడుదల కావడం చాలామందికి షాక్ ఇస్తోంది. ఛానల్స్ పెరిగి పోవడంతో వాటి రేటింగ్స్ కోసం రకరకాల సీరియల్స్ ను నిర్మిస్తూ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిన విషయమే. 

విపరీతమైన డ్రామాతో కుట్రలు కుతంత్రాలతో వందల స్థాయిలో ఎపిసోడ్లు తమ సీరియల్స్ కు సంబంధించి బుల్లితెర పై ప్రసారం చేయడానికి ఆ సీరియల్స్ సంగీత దర్శకులు విచ్చిలవిడిగా తెలుగు బ్లాక్ బస్టర్స్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని పాటలను వాడేసుకుంటూ చేస్తున్న హంగామాతో బుల్లితెర షేక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితిని ఆ పాటలకు సంబంధించిన తెలుగు నిర్మాతలు సంగీత దర్శకులు కూడ ఏమి నియంత్రణ చేయలేక పోతున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్యనే ప్రాంరంభం అయిన ఒక సీరియల్ లో మహర్షిలోని ‘ఇదే కదా నీ కథ’ పాటను పూర్తిగా వాడేస్తూ ఆ పాటలో ఆ సీరియల్ లోని హీరో హీరోయిన్స్ చేత నటింప చేసారు. దీనితో అప్పుడప్పుడు సీరియల్స్ చూసే వారికి ‘మహర్షి’ విడుదల కాకుండానే బుల్లితెర పై అప్పుడే ప్రసారం అయిపోతోంద అన్న సందేహాలు కలుగుతున్నాయి.  

ఆ సీరియల్ కు సంబంధించి ‘మహర్షి’ మూవీలోని పాట ప్లే అవుతున్నపుడు ఒకరు వీడియో క్యాప్చర్ చేసి ట్విట్టర్లో పెట్టడంతో ఇప్పుడు ఆ సీరియల్ అందరికీ తెలిసిన పాపులర్ సీరియల్ గా మారింది. గతంలో ఒకసారి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇలా సీరియల్స్ లో పాపులర్ సాంగ్స్ ను వాడుకోవడం ఏమిటి అని ఉద్యమించినా నాగార్జున చిరంజీవిల ఆద్వర్యంలో నడిచే ఛానల్స్ లో కూడ ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో సినిమాలకు సంబంధించి భారీ పారితోషికాలు ఇచ్చి రచయితల చేత పాటలు వ్రాయించి కోట్లు ఖర్చు పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేయించిన పాటలను స్వేచ్చగా టివి సీరియల్స్ లో దర్శక నిర్మాతలు వాడేసుకోవడం ఎవరికీ అదుపులేని విషయంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: