కామాతురాణాం.. నభయం.. న లజ్జ..అంటారు. అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, లజ్జ ఉండవట. మరికొందరు దీనికి న సమయం అని కూడా యాడ్ చేస్తారు. అంటే కామం ప్రకోపిస్తే..  సమయం, సందర్భం కూడా ఉండవన్నమాట.. ఈ నానుడి అక్షరాలా నిజం చేశాడో ముసలాడు. 


చాన్నాళ్ల క్రితం ముచ్చట. ఓ హీరోయిన్ చెన్నై నుంచి హైదరబాదా వస్తోంది. కిటికీ పక్క సీట్లో కూర్చుంది. ఆమె పక్కన ఓ ముసలాడు కూర్చున్నాడు. పక్క సీట్లో ఉన్నది ఓ హీరోయిన్.. అందులోనూ మిసమిసలాడుతోంది. దాంతో ముసలాడికి కామం పెరిగింది. 

ఏదైతే అదే అయ్యిందనుకున్నాడో ఏమో.. మోచేత్తో.. హీరోయిన్‌ ను తాకడం మొదలుపెట్టాడు.. పాపం ఆ హీరోయిన్‌.. మొదట్లో ఏదో చేయి తగులుతుందేమో అనుకుందట. ఆ తర్వాత తెలిసింది ముసలాడు వెదికేది ఇంకేదో అని.. అంతే కోపం నషాళానికంటింది. ఇంకేముంది..ముసలాడి గూబ గుయ్యిమంది.. 

ఏంట్రా ఇంత వయసొచ్చినా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్.. అంటూ ఆ హీరోయిన్ ఆ ముసలాయన్న ఎడాపెడా వాయించేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదూ.. ఆమే ఒకనాటి  హీరోయిన్  రక్ష. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గుర్తు చేసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: