భాష-యాస ఇవి ఒకదానికి మరొకటి పూవు-తావి లాగే అమిరితెనే అందం. ఒక యాస ఆధిపత్యం వహించే రోజుల్లో మరో యాస అణిగి మణిగి ఉండేది. అధికారంలో ఉన్న నాయకుల యాస అంతటా ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు వెనుకబడ్డ ప్రాంతాల ప్రజల యాసకు గుర్తింపు ఉండదు. ఆ బాషను సినిమాల్లో సైతం అనాగరిక వ్యక్తులకో ప్రతి నాయకులకో వాడేవారు. ఆ పరిస్థితుల నుండి తెలంగాణా తెలుగు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరవాత ఒక్క సారిగా తెలంగాణా యాసతో విస్పొటనం చెందింది. అందుకే ఆ భాష ఆ యాస లోని పరిమళం గుప్పుమని ఒక్కసారి ప్రపంచానికి చూపారు శేఖర్ కమ్ముల తన ఫిదా చిత్రంలో    
Image result for fida movie
‘వచ్చిండే..మెల్లా మెల్లగ వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే..గమ్మున కూర్చొనీయడే..కుదురుగా నిల్చోనీయడే’ అంటూ ఫిదా చిత్రంలో వచ్చిన పాట ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తున్నా ఈ సినిమాలోని పాటలకు మాత్రం ప్రేక్షకులు ఇంకా ఫ్రెష్గా ఫిదా అయిపోతున్నారు. 
Image result for telugu Fida beautiful scenes
"వచ్చిండే..మెల్లా మెల్లగ వచ్చిండే" పాటకు సాయిపల్లవి స్ప్రింగులు మింగినట్లు చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇపుడు ఈ పాట అరుదైన రికార్డును నమోదు చేసింది. యూట్యూబ్ లో ఈ పాటను రెండు వందల మిలియన్లు (20 కోట్లు)మందికి పైగా వీక్షించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శక్తికాంత్ కార్తీక్ కంపోజ్  చేయగా.. మధుప్రియ పాడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వీడియో సాంగ్ మీ కోసం.. అందుకే ఏ సాహిత్యమై నా ప్రజల హృదయాల నుండి పెల్లుభికిన యాసతో పండితేనే పరిమళాలు ఘుభాలిస్తుంది. 

Vachinde song from Fidaa got 200 Million views in youtube

Vachinde Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula

200,673,153 views

మరింత సమాచారం తెలుసుకోండి: