'సైరా' సెట్ కు ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదం వల్ల మెగా కాంపౌండ్ కు జరిగిన ఆర్ధిక నష్టాన్ని పక్కకు పెట్టి ఈమూవీ సెట్ అగ్ని ప్రమాదం వల్ల 'సైరా' రిలీజ్ యాక్షన్ ప్లాన్ లో మార్పులు తప్పనిసరి అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేసి దసరా రేసుకు విడుదల చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎదో ఒక అడ్డంకి వస్తూ ఉండటంతో 'సైరా' విడుదల ఇక కేవలం వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు అనుకోకుండా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ పోటీ పడుతుందా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్యే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చే లోగానే ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి రేసుకు విడుదల చేయాలి అన్నది బాలయ్య మాస్టర్ ప్లాన్ అని టాక్. 

బాలయ్య సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతి రేసుకు వచ్చిన బాలకృష్ణ సినిమాలు చాలామటుకు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ బాలకృష్ణ కెఎస్ రవికుమార్ ల మూవీకి అన్వయిస్తున్నట్లు టాక్. గతంలో బాలకృష్ణ తన 'గౌతమీపుత్ర శాతకర్ణి'  తో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' కి ధైర్యంగా ఎదురు వెళ్ళి విజయం సాధించాడు. 

వాస్తవానికి 'సైరా' మూవీ బడ్జెట్ కు బాలయ్య కెఎస్ రవికుమార్ ల మూవీ బడ్జెట్ కు ఏమాత్రం పోలిక లేదు. చాలా తక్కువ బడ్జెక్ట్ తో బాలకృష్ణ సినిమాను తీస్తున్నారు. ఈసినిమాలో పెద్దగా క్రేజ్ లేని కన్నడ హీరోయిన్ హరిప్రియ బాలయ్య పక్కన నటిస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న విషయాలు ఏమీ పట్టించుకోకుండా సంక్రాంతికి ఎన్ని భారీ సినిమాలు వచ్చినా బాలయ్య కెఎస్ రవికుమార్ ల మూవీ సంక్రాంతికి ఖాయం అంటూ వస్తున్న లీకులు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: