‘గీత గోవిందం’ ‘అర్జున్ రెడ్డి’ సినిమాల సక్సస్ లో ఆమూవీ కోసం చిత్రీకరించిన లిప్ లాక్ సీన్స్ చాల కీలక పాత్ర పోషించాయి. ఇది చాలదు అన్నట్లు గా వచ్చేనెల విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీలో కూడా విజయ్ రష్మికల మధ్య చిత్రీకరించిన డీప్ లిప్ లాక్ సీన్ సుమారు రెండు నిముషాలు ఉంటుంది అని టాక్. 

దీనితో విజయ్ దేవరకొండను టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి అన్న ముద్దు పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో త్వరలో ప్రారంభం కాబోతున్న విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ విషయంలో కూడ ఒక డీప్ లిప్ లాక్ సీన్ ను పెట్టమని ఈమూవీ నిర్మాతలు దర్శకుడు క్రాంతి మాధవ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.

ఈమూవీలో రాశి ఖన్నా విజయ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో విజయ్ రాశి ఖన్నా లపై ఒక సందర్భం క్రియేట్ చేసి ఒక డీప్ లిప్ లాక్ సీన్ ను అవసరం లేకున్నా పెట్టమని ఈమూవీ నిర్మాతలు చెపుతున్న సూచనలకు ఈమూవీ దర్శకుడుతో పాటు విజయ్ కి కూడ షాక్ అవుతున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈ లిప్ లాక్ ల మ్యానియా నుండి బయటకు వచ్చి మరిన్ని విభిన్నమైన సినిమాలలో నటించాలని విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నా అతడిని మాత్రం ఈ లిప్ లాక్ సీన్స్ ఇప్పట్లో వదిలి పెట్టే ఆస్కారం కనిపించడం లేదు. దీనితో తనపై పడ్డ ముద్రను తొలిగించు కోవడానికి క్రాంతి మాధవ్ సినిమా ఒక్కటే తనకు పరిష్కారం అన్న భావాలో విజయ్ దేవరకొండ ఉంటూ నిర్మాతలకు సద్ది చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: