మహేష్ బాబు .. మహర్షి ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి గురించి పలు సందర్బాల్లో ప్రస్తావిస్తున్నారు.  ఏదో ఒక రూపంలో జక్కన్న ప్రస్తావన లేకుండా మహేష్ ఇంటర్వ్యూలు జరగడం లేదు. అందులో భాగంగా ఇచ్చిన ఓ ముఖాముఖీలో మహేష్ కు బాలీవుడ్ ఎంట్రీ గురించిన ప్రశ్న ఎదురైంది. ఇక్కడే చాలా తెలివిగా ప్రిన్స్ చెప్పిన సమాధానం ఆకట్టుకుంది. రాజమౌళి తీసే సినిమాలన్నీ తెలుగులోనే తీస్తున్నారని కాని అవి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నాయి అంటే మనం ఇక్కడే ఉండి ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో దీని ద్వారా అర్థం చేసుకోవాలని మహేష్ చెప్పాడు.


అంటే ఒకవేళ హిందిలో సినిమా చేయాలి అనుకున్నా దాన్ని ఇక్కడే తీసి అక్కడికి డబ్ రూపంలోనో మల్టీ లాంగ్వేజ్ గానో తీసుకెళ్ళాలి తప్ప ముంబై వెళ్లి చేయాల్సిన అవసరం లేదని మహేష్ ఉద్దేశంఇందులో లాజిక్ ఉంది. ఇప్పటికీ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్రాండియర్ ను కూడా తెలుగులోనే తీస్తున్నాడు. మిగిలిన బాషలలో డబ్ అవుతుంది అంతే. దానికే డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రత్యేకంగా ఇంకో బాష జక్కన్నకు అవసరం లేదు.


మహేష్ పాయింట్ కూడా ఇదే. ఇదంతా బాగానే ఉంది కాని పాతిక సినిమాలు పూర్తైనా మహేష్ రాజమౌళి కాంబో ఇప్పటికీ కుదరకపోవడం పట్ల అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు. మహేష్ తో తప్పకుండ ఉంటుంది అని ఊరిస్తున్నాడు కాని ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పడం లేదు. పోనీ ఆర్ఆర్ఆర్ తర్వాతైనా ఒక ఛాయస్ పెట్టుకుంటే బెటరేమో ..!

మరింత సమాచారం తెలుసుకోండి: